https://oktelugu.com/

Gautam Adani: నాలుగు నెలల తర్వాత మళ్లీ పైపైకి.. ఆసియాలో రెండవ ధనవంతుడిగా గౌతమ్ అదానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనికుడిగా పేరుపొందారు.. అయితే ప్రస్తుతం గౌతమ్ షేర్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆయన రెండవ స్థానానికి ఎగబాకారు.

Written By: Rocky, Updated On : May 25, 2023 3:50 pm

Gautam Adani

Follow us on

Gautam Adani: హిండెన్ బర్గ్ నివేదికతో ఏర్పడిన అల్లకల్లోలం అదాని గ్రూప్ వ్యాపారాలను అతలాకుతలం చేసేసింది. దీని నుంచి చేరుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టులో సెబీ దర్యాప్తు వ్యవహారంలో ఊరట లభించిన నేపథ్యంలో గ్రూప్ షేర్లు పరుగులు పెట్టడం ప్రారంభించాయి. దీంతో గ్రూప్ షేర్లు బుల్ పరుగులు పెట్టాయి. ఫలితంగా గౌతమ్ సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా ఆయన కంపెనీల్లో అప్పుడు షేర్లు కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు లాభాలు కళ్ల చూస్తున్నారు. స్క్రిప్ వేల్యూ అమాంతం పడిపోవడంతో అప్పట్లో చాలా మంది వేలాది షేర్లు కొనుగోలు చేశారు.. వీరిలో తెలుగు వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఆదాని గ్రూప్ వాల్యూ పెరిగిపోతున్న నేపథ్యంలో వారి షేర్లకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. ఫలితంగా వారు ఊహించని స్థాయిలో లాభాలు పొందుతున్నారు. మరోవైపు అదాని గ్రూప్ సంస్థలకు సంబంధించి నియమించిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఇంకా కొన్ని విషయాలు తేల్చాల్సి ఉందని చెప్పినప్పటికీ, అదానీ గ్రూపు సంస్థల వ్యాల్యూ పెరగడం విశేషం.

ముఖేష్ మొదటి స్థానంలో

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనికుడిగా పేరుపొందారు.. అయితే ప్రస్తుతం గౌతమ్ షేర్లు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఆయన రెండవ స్థానానికి ఎగబాకారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఆదాని ఇప్పుడు 23 స్థానాల నుంచి ఏకంగా 18వ స్థానానికి చేరుకున్నారు. ఆయన ఆస్తులు విలువ ప్రస్తుతానికి 64.2 బిలియన్ డాలర్లు గా ఉంది. మంగళవారం నాటికి ఆయన నికర ఆస్తుల విలువ 4.38 బిలియన్ డాలర్ల మేరకు పెరిగింది.

అంబానీ కంటే ముందు ఉన్నది వీరే..

ఇక ప్రపంచంలోని టాప్ _10 సంపన్నుల్లో 9 మంది అమెరికన్లు ఉన్నారు. 125 బిలియన్ డాలర్ల సంపదతో బిల్లెట్స్ నాలుగవ స్థానంలో, 113 బిలియన్ డాలర్లతో వారన్ బఫెట్ ఐదవ స్థానంలో, 111 బిలియన్ డాలర్లతో లారీ ఎల్లీసన్ ఆరో స్థానంలో, 111 బిలియన్ డాలర్లతో లారీ ఫేస్ ఏడో స్థానంలో, 110 బిలియన్ డాలర్లతో స్టీవ్ బాల్మేర్ ఎనిమిదవ స్థానంలో, 105 బిలియన్ డాలర్లతో బ్రీన్ తొమ్మిదవ స్థానంలో, మార్క్ జుకర్ బర్గ్ 90.3 బిలియన్ డాలర్ల తో పదో స్థానంలో కొనసాగుతున్నారు.