Homeబిజినెస్Global Job Crisis: రాబోయే రోజుల్లో ఉద్యోగ సంక్షోభం..: వరల్డ్ బ్యాంక్

Global Job Crisis: రాబోయే రోజుల్లో ఉద్యోగ సంక్షోభం..: వరల్డ్ బ్యాంక్

Global Job Crisis: అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయ సంక్షోభం.. ఆర్థికమాంద్యం కారణంగా భవిష్యత్ లో ఉద్యోగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉండేట్లు కనిపిస్తోంది. మరికొన్ని నెలలపాటు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ Ajay Banga హెచ్చరించారు. ప్రస్తుతం యుద్ధాలు, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అసలైన సవాలు నిరుద్యోగమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఈ అంశంపై […]

Global Job Crisis: అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయ సంక్షోభం.. ఆర్థికమాంద్యం కారణంగా భవిష్యత్ లో ఉద్యోగాల పరిస్థితి ఆందోళనకరంగా ఉండేట్లు కనిపిస్తోంది. మరికొన్ని నెలలపాటు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యోగ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ Ajay Banga హెచ్చరించారు. ప్రస్తుతం యుద్ధాలు, ఆర్థిక అస్థిరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అసలైన సవాలు నిరుద్యోగమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఈ అంశంపై ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితె..

వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సుమారు 120 కోట్ల మంది పనిచేసే వయసులోకి ప్రవేశించనున్నారు. అయితే అదే సమయంలో కేవలం 40 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడే అవకాశముందని అంచనా. అంటే దాదాపు 80 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగిలే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జనాభా వేగంగా పెరుగుతుండగా.. అందుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు మాత్రం అంత వేగంగా పెరగడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగుల అవసరం ఇప్పటికే తగ్గిపోతోంది. ఫలితంగా కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు సరిపడా అవకాశాలు లభించకపోవచ్చు.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు దేశాలు కొన్ని కీలక రంగాలపై దృష్టి పెట్టాలని Ajay Banga సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, తయారీ రంగం, పర్యాటక రంగాలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెంచితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉంది.

అదేవిధంగా, నైపుణ్యాల అభివృద్ధి (skill development)పై కూడా దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువతను శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. లేదంటే అందుబాటులో ఉన్న ఉద్యోగాలను కూడా పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. స్కిల్ ట్రైనింగ్, వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.

రాబోయే రోజుల్లో ప్రపంచం ఒక పెద్ద ఉద్యోగ సవాలును ఎదుర్కొనే దిశగా కదులుతోంది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా వ్యవస్థ అన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో భారీ నిరుద్యోగ సమస్యను నియంత్రించడం సాధ్యమవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper