Free Tv Channels : ప్రపంచీకరణలో భాగంగా నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సేవల వినియోగం ఖర్చులూ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఒక్కరి ఇంట్లో టెలివిజన్ ఉంటే అందరూ ఒకే చోటుకు వచ్చి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతీ ఇంట్లో టెలివిజన్ ఉంటోంది. అయితే టెలివిజన్ కొనగానే సరిపోదు. మనకు కావాల్సిన ఛానల్స్ రావాలంటే నెలనెల కేబుల్ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ డీటీహెచ్ ఉంటే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొన్ని సంస్థలు వైఫై తో పాటు ఛానల్స్ ను కూడా తక్కువ ధరకే అందిస్తున్నాయి. కానీ ఓ ట్రిక్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 600 వరకు ఛానల్స్ ను వీక్షించవచ్చు. అదెలాగో చూద్దాం..
రోజంతా బిజీ ఉన్న వాళ్లకు టీవీ ఎంతో వినోదాన్ని అందిస్తుంది. కానీ ఇప్పుడు టీవీ వీక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండడంతో టెలివిజన్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే కొందరు టీవీ ప్రియులు లేకపోలేదు. మొబైల్ లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా టీవీలో ఏ చానల్ కావాలంటే ఆ ఛానల్ ను చూసేవిధంగా సెట్ చేసుకోవచ్చు. ఇలా చూడడానికి ఎలాంటి బిల్లు పే చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా దీనికి ప్రత్యేక సెటప్ బాక్స్ కూడా అసరం లేదు. మరెలాగంటారా?
మొబైల్ లోని ప్లే స్టోర్ లోకి వెళ్లి Network StreamPlayer ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో Playlist ఆప్షన్ వస్తుంది. ఈ పేజీపై ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు Add URL ను క్లిక్ చేయాలి. ఇప్పుడు రెండు బాక్సులు వస్తాయి. పైన బాక్సులో Iptv అని టైప్ చేయాలి. కింద బాక్స్ లో ఒక యూఆర్ ఎల్ ను కాపీ పేస్ట్ చేయాలి. అదెక్కడ లభిస్తుందంటే.. Telegram యాప్ లోకి వెళ్లి @techwithsowji అని టైప్ చేయాలి. ఇందులో టీవీకి సంబంధించిన యూఆర్ ఎల్ ఉంటుంది. దీనిని పేస్ట్ చేస్తే ఏ ఛానెల్ అంటే ఆ చానెల్ ను ఫ్రీగా చూడొచ్చు.