Hyundai :దేశీయంగా మిగతా కార్లతో పోటీ పడుతున్న హ్యుందాయ్ వివిధ వేరియంట్లు కలిగిన మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇటీవల కొన్ని కార్ల విక్రయాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్తగా కారు కొనుగోలు చేసేవారితో పాటు ఎక్చేంజ్ చేసుకునేవారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయిని తెలిపింది. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.4 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో హ్యాచ్ బ్యాక్ నుంచి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. మరి ఈ కంపెనీ ఏయే కార్లపై ఎలాంటి డిస్కౌంట్లను ప్రకటించిందో చూద్దామా..
హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన i10 NIOS గురించి తెలిసే ఉంటుంది. ఈ కారుపై రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.10 వేల ఎక్చేంజ్ బోనస్, రూ.3 వేల ప్రత్యేక బోనస్ ఇవ్వనుంది. ఇదే మోడల్ లోని స్టాండర్డ్ వేరియంట్ పై రూ.28,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఏఎంటీ వేరియంట్ విషయానికొస్తే రూ.18 వేల తగ్గింపు ధరతో కారును దక్కించుకోవచ్చు. మరో మోడల్ అరా, వెర్నా లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. ఇందులో Aura కారు CNG వేరియంట్ పై రూ.33,000 తగ్గింపును ప్రకటించింది. స్టాండర్డ్ కారుపై అన్ని ఆఫర్ల తో కలిపి రూ.18 వేల తగ్గింపుతో ఇస్తుంది.
Verna కారుపై రూ.35,000 వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇందులో 15,000 నగదు డిస్కౌంట్, రూ.20,000 ఎక్చేంజీ బోనస్ పొందవచ్చు. టక్సన్ అనే కారుపై ఏకంగా రూ.50 వేల వరకు రిటర్న్స్ వస్తాయి. SUVవేరియంట్ లో ఉన్న ఈ కారు పెట్రోల్ వేరియంట్ అయితే రూ.4 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ పై రూ.25,000 తగ్గింపు ప్రయోజనాలు అందించనుంది. అల్కాజార్ ఎస్ యూవీ పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.35,000 తగ్గింపును ప్రకటించింది.
పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లపై కూడా తగ్గింపును ప్రకటించారు. హ్యుందాయ్ నుంచి అందుబాటులో ఉన్న కోనా ఎలక్ట్రిక్ కారుకు రూ.4 లక్షల వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ కారు సేల్స్ ఇటీవల పెరుగుతున్నాయి. అయితే ఈ డిస్కౌంట్లు ఈనెల 29 వరకేనని తెలిపారు. అందువల్ల కొత్తగా కారు కొనాలనుకునే వారు వెంటనే ఈ ఆపర్ల కింద కొనుగోలు చేయడం వల్ల భారీగా నగదు ప్రయోజనాలు పొందుతారు .