Car mileage : కారు అనేది చాలా మంది మధ్య తరగతి వారి కల. ప్రతీ ఒక్కరూ కూడా కారు కొనుగోలు చేయాలని డబ్బులు ఆదా చేస్తుంటారు. వారికి వచ్చిన జీతంలో ప్రతీ నెల కొంత ఆదా చేసి, కొంత అప్పుు చేసి కారు కొంటారు. అయితే మార్కెట్‌లో పెద్ద కార్లతో పాటు చిన్న కార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని బాగా ఖరీదు ఉంటాయి. కానీ మైలేజ్ చాలా తక్కువగా ఇస్తాయి. చాలా మంది తక్కువ ఖరీదు.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు. దీంతో కారులో అన్ని ఫీచర్లు కూడా చూస్తారు. ఇంజిన్, ఎయిల్ ఫిల్టర్, టాప్ అన్ని కూడా చూసి కారు కొనుగోలు చేస్తుంటారు. కొందరు ఏం తెలియక కారు కొనుగోలు చేస్తారు. అయితే తక్కువ మైలేజ్ కారును తీసుకున్నా కూడా ఎక్కువ మైలేజ్ రావాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు పాటిస్తే తప్పకుండా కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. మరి మైలేజ్ విషయంలో పాటించాల్సిన ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
టైర్‌లో గాలి ఉండేలా చూసుకోవాలి
కొందరు కార్లకు గాలి తక్కువగా ఉన్నా కూడా నడుపుతుంటారు. ఇలా చేయడం వల్ల కారు ఎక్కువ మైలేజ్ రాదు. ఎప్పుడైనా కూడా కారు టైర్లలో గాలి ఎక్కువగా ఉంటే మీరు హ్యాపీగా నడపగలరు. దీనివల్ల మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. అదే గాలి లేకపోతే మీరు కష్టం మీద కారు డ్రైవ్ చేయాలి. అప్పుడు మీకు పెట్రోల్ కూడా ఒక మూడు శాతం ఎక్కువ అవుతుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, ఇంజిన్ ఆయిల్ వంటి భాగాలను అప్పుడప్పుడు మార్చాలి.
ట్రాఫిక్‌లో జాగ్రత్తగా ఉండాలి
కొందరు ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆపరు. ఉండండి: మీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారును ఆపినప్పుడు లేదా మీరు కారును ఆపినప్పుడు, కారు ఇంజిన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోవడం మంచిది.
కారు ఓవర్‌లోడ్ ఉండకూడదు
కారు ఓవర్‌లోడ్ అయితే మాత్రం వెంటనే అలర్ట్ కావండి. ఎక్కువగా అనవసర వస్తువులను అందులో ఎక్కించవద్దు. ఎందరు కూర్చోవాలో వారు మాత్రమే కూర్చోవాలి. అంత కంటే ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో కారు మైలేజీ తగ్గుతుంది. కాబట్టి అవసరమైన వస్తువలును మాత్రమే పెట్టండి.
నెమ్మదిగా డ్రైవ్ చేయాలి
కొందరు నార్మల్‌గా వెళ్తూ.. ఒక్కసారిగా కారు వేగం పెంచుతారు. ఇలా చేయడం వల్ల కారు ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మైలేజ్ తగ్గిపోతుంది.
ఇంజిన్ జాగ్రత్తగా చూసుకోవాలి
ఇంజిన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ దెబ్బతింటే ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడూ రెగ్యులర్ కార్ సర్వీసింగ్ చేయించండి. ముఖ్యంగా ఇంజిన్‌కి సర్వీస్ చేయించండి. దీంతో కారు ఎక్కువగా మైలేజీని ఇస్తుంది.
ఏసీని అనవసరంగా ఆన్ చేయవద్దు
కారు ఏసీని అనవసరంగా నడపవద్దు. దీనివల్ల గాలి నియంత్రణ తక్కువగా ఉంటుంది. దీంతో మైలేజ్ తగ్గిపోతుంది.