Flipkart New Year offer: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొందరు బడ్జెట్లో మొబైల్ కొనాలని చూస్తుంటారు. ఇలాంటివారు పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆఫర్స్ లో మొబైల్స్ కొనాలని చూస్తుంటారు. వీరి కోసం కొత్త సంవత్సరం సందర్భంగా Flipkart సంస్థ ఓ మొబైల్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఆ మొబైల్ ను దాదాపు రూ.4,000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్లో ఆకట్టుకునే ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇంతకు ఆ మొబైల్ ఏది? ధర తగ్గిన తర్వాత ఇది ఎంతకు కొనుగోలు చేయవచ్చు?
POCO మొబైల్స్ తక్కువ ధరకే వస్తుంటాయని చాలామంది భావన. అందులోనూ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల మరింత తక్కువకు పొందవచ్చు. ఇప్పటికే పోకో కంపెనీ నుంచి ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా POCO F7 5G అనే మొబైల్ పై భారీ తగ్గింపును ప్రకటించారు. ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో రూ.31,999 తో విక్రయిస్తున్నారు. అయితే Flipkart దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.2,000 తగ్గింపు ప్రకటించింది. అలాగే HDFC, ICICI Bank క్రెడిట్ కార్డులు ఉంటే వాటిపై రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తంగా రూ.4,000 తగ్గింపుతో మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.27,999 కే అద్భుతమైన మొబైల్ పొందవచ్చు.
అయితే ఇందులో ఉండే ఫీచర్స్ ను చూస్తే తక్కువ ధరకే మొబైల్స్ కొన్నామన్నా ఫీలింగ్స్ వస్తుంది. POCO F7 5G అనే మొబైల్లో 8GB ram ను అమర్చారు. అలాగే 256 జిబి స్టోరేజ్ పండగ ఉంది. ఇది హై ఎండ్ గేమింగ్ తో పాటు మల్టీ టాస్కింగ్ అవసరాలకు ఉపయోగపడే విధంగా సెట్అప్ చేశారు. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే ఆకట్టుకొని ఉంది. ఇందులో AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 6.83 అంగుళాల తో 1.5 k రిజర్వేషన్..120 Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే కు HDR మద్దతు కూడా ఉండనుంది. దీంతో వీడియోలు, గేమింగ్ కోరుకునే వారికి ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ మొబైల్ లో కెమెరా కూడా ఆకట్టుకునేలా ఉంది.20 MP మెయిన్ కెమెరాను అమర్చగా ఆల్ట్రా వైట్ కెమెరా 8MP తో పనిచేస్తుంది. ఈ కెమెరా తో 4k వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఏఐ ఆధారిత ఫోటోగ్రఫీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక ఇందులో బలమైన బ్యాటరీ తో పాటు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే విధంగా సెట్ చేశారు. ఈ మొబైల్లో 7,550 mAh బ్యాటరీని సెట్ చేయగా ఈ బ్యాటరీ..90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్లో ఆధునిక టెక్నాలజీ కలిగిన ఫీచర్లు కావాలని కోరుకునే వారికి ఈ ఫోన్ అనుకూలంగా ఉండనుంది.