https://oktelugu.com/

Finance: ఫైనాన్స్ లో బైక్ తీసుకోవడం మంచిదేనా.. నిపుణులేం చెప్పారంటే?

Finance: మన దేశంలో వ్యక్తిగత ప్రయాణాల కోసం స్కూటర్, బైక్స్ ను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. స్కూటర్ లేదా బైక్ పై వెళితే మాత్రమే సమయం ఎక్కువగా ఆదా అవుతుందని వాహనదారులు చెబుతున్నారు. కొంతమంది వాహనాలపై ఫ్యాషన్ తో వాటిని వినియోగిస్తుంటే చాలామంది అవసరాల నిమిత్తం స్కూటర్ లేదా బైక్ ను వినియోగిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం మరింత పెరుతోంది. అయితే స్కూటర్ లేదా బైక్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 27, 2021 5:05 pm
    Follow us on

    Finance: మన దేశంలో వ్యక్తిగత ప్రయాణాల కోసం స్కూటర్, బైక్స్ ను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. స్కూటర్ లేదా బైక్ పై వెళితే మాత్రమే సమయం ఎక్కువగా ఆదా అవుతుందని వాహనదారులు చెబుతున్నారు. కొంతమంది వాహనాలపై ఫ్యాషన్ తో వాటిని వినియోగిస్తుంటే చాలామంది అవసరాల నిమిత్తం స్కూటర్ లేదా బైక్ ను వినియోగిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం మరింత పెరుతోంది.

    Finance

    Finance

    అయితే స్కూటర్ లేదా బైక్ ను కొనుగోలు చేసేవాళ్లలో చాలామంది ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా స్కూటర్ లేదా బైక్ ను కొనుగోలు చేస్తున్నారు. ఫైనాన్స్ తీసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉంటే మరికొన్ని నష్టాలు ఉన్నాయి. లాభనష్టాలను బేరీజు వేసుకొని ఫైనాన్స్ తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా ఎక్కువ ధర ఉన్న బైక్ ను కూడా రాజీ పడకుండా కొనే ఛాన్స్ ఉంటుంది.

    Also Read: 10,000 రూపాయలతో లక్షల్లో సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే?

    ఫైనాన్స్ ద్వారా పొదుపు చేసిన డబ్బులను కదిలించాల్సిన అవసరం ఉండదు. ఫైనాన్స్ వల్ల ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. టూ వీలర్ రుణాలపై వడ్డీ రేటు 7 నుంచి 18 శాతం వరకు ఉండగా బ్యాంకు, కాలపరిమితిని బట్టి వడ్డీరేటు మారే అవకాశం ఉంటుంది.

    ఫైనాన్స్ వల్ల పొదుపు అలవాటు కావడంతో పాటు సరైన పద్ధతిలో పొదుపు చేయడం ద్వారా సంపదను సృష్టించుకునే ఛాన్స్ ఉంటుంది. ఆన్ లైన్ లో కూడా ఫైనాన్స్ తీసుకునే అవకాశాన్ని పలు సంస్థలు కల్పిస్తున్నాయి. స్థిరమైన ఆదాయం లేకపోతే మాత్రం ఫైనాన్స్ కు దూరంగా ఉంటే మంచిది.

    Also Read: అదిరిపోయే ఉద్యోగవకాశం.. రోజుకు 59 వేల జీతం దరఖాస్తుకు కొద్ది రోజులే గడువు!