AP Liquor Business: మద్యం ద్వారా ప్రభుత్వాలు భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే తనకు వచ్చే ఆదాయంపైనే ప్రధానంగా గురిపెడుతోంది. అంత పెద్ద మొత్తంలో ఆదాయం మద్యం ద్వారా వస్తోందని తెలుస్తోంది. దేశంలోని ఏ రాష్ర్టమైనా మద్యంపైనే ఆధారపడుతోంది. ఓ వైపు షాపులు తగ్గిస్తున్నా ఆదాయం మాత్రం తగ్గడం లేదు. పర్మిట్ రూములు సైతం రద్దు చేసినా ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మద్యం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. మద్యంపై ఆరు నెలల్లోనే భారీగా ఆదాయం రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఏడాదిగా గరిష్టంగా రూ. కోట్ల ఆదాయం రావడం తెలిసిందే. ప్రభుత్వ మనుగడలో మద్యం ఆదాయం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సర్కారు బండికి ఇంధనంగా మారుతోంది. దీంతో ప్రభుత్వం కూడా మద్యంపై వచ్చే రాబడిని వదులుకోవడం లేదు.
అయితే గతంలో అధికారంలోకి రాకముందు మద్య నిషేధం చేస్తామని చెప్పినా ఆ సాహసం చేయడం లేదు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం ఆధారపడుతోంది. ఇదే సందర్భంలో ఇతర స్టేట్ల నుంచి కూడా మద్యం రాకుండా కట్టడి చేసి తమ ఆదాయానికి ఢోకా లేకుండా చేసుకుంటోంది. గుడుంబా వ్యాపారం కూడా కొనసాగకుండా దాడులు చేస్తూ మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేందుకు దోహదపడుతోంది.
Also Read: AP Sarkar: అప్పుల కోసం ఏపీ సర్కార్ తిప్పలు.. ఏకంగా చట్టసవరణ
మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఏపీకి జీవ ఔషధంగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం పనిచేస్తోంది. దీంతో రాష్ర్టంలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం రోజురోజుకు ఆదాయం తెచ్చే వనరుగా మారుతోందని తెలుస్తోంది. ఏపీకి వస్తున్న ఆదాయం చూస్తుంటే మతి పోతోంది. భారీగా ఆదాయం రావడంతో ప్రభుత్వ మనుగడకు కూడా ఢోకా లేనట్లు తెలుస్తోంది.
Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణపై ఇంకా సందేహాలేనా?