మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల రాబోతుంది. కేవలం 28 రోజులు మాత్రమే ఉన్న ఫిబ్రవరి నెలలో ఎలాంటి పండుగలు లేకపోవడంతో కేవలం ఆరు రోజులు బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. తరచూ బ్యాంకు లావాదేవీలను నిర్వహించేవాళ్లు బ్యాంకు సెలవుల గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. మొత్తం ఆరు సెలవులలో నాలుగు రోజులు ఆదివారాలు కాగా మిగిలిన రెండు రోజులు శనివారాలు కావడం గమనార్హం.
Also Read: ఫేస్ బుక్ సంచలన నిర్ణయం.. వారికి భారీ షాక్..?
జనవరి నెలలో న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే వల్ల ఎక్కువ రోజులు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరి నెల 16వ తేదీన వసంత పంచమి ఉండగా కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగకు సెలవు ఉన్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం సెలవు లేదు. 22 రోజులు బ్యాంకులు పని చేయనుండగా ముఖ్యమైన లావాదేవీలు జరపాలనుకునే వాళ్లకు ఫిబ్రవరి నెలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆర్బీఐ అధికారక వెబ్ సైట్ బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతుంది.
Also Read: పన్ను చెల్లింపుదారులకు మోదీ సర్కార్ భారీ ఝలక్..?
ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 28 తేదీలు ఆదివారాలు కాగా ఫిబ్రవరి 13, ఫిబ్రవరి రెండో శనివారం, నాలుగో శనివారంగా ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు చేసేవాళ్లు ఈ తేదీలను మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. గతేడాది ఫిబ్రవరి నెలలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఒకరోజు అదనంగా సెలవు రాగా పండుగ మార్చి నెలలో వచ్చింది. అయితే రాష్ట్రాల ప్రాతిపదికన సెలవుల్లో మార్పులు ఉంటాయి.
మరిన్ని వార్తలు కోసం: వ్యాపారము
ఈరోజుల్లో నగదు వ్యవహారాలు ప్రతి ఒక్కరికీ ముఖ్యమే. వ్యాపారాలు చేసేవాళ్లకు డిమాండ్ డ్రాఫ్ట్ లు జమ చేయడం, చెక్కులు డిపాజిట్ చేయడం వంటివి ఉన్న సందర్భంగా బ్యాంకు సెలవులపై ప్రతి నెల అవగాహన ఏర్పరచుకుని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.