Gold Prices: బంగారం ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా బులియన్ మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా పసిడి ధరలు తగ్గి ఆదివారం స్థిరంగా ఉన్నాయి. అయితే సోమవారం స్వల్పంగా తగ్గాయి. దీనిని భట్టి చూస్తు ప్రస్తుతం బంగారం ధరలు డౌన్ ఫాల్ లోనే ఉంటుందని తెలుస్తోంది. వెండి ధరలు కూడా అదేస్థాయిలో పతనం అవుతూ ఉన్నాయి. అక్టోబర్ 3న బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం అక్టోబర్ 3న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.53,350గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములను రూ.58,190 గా నమోదైంది. 22 క్యారెట్లు బంగారం స్థిరంగా ఉండగా 24 క్యారెట్లు స్వల్పంగా తగ్గింది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,190తో విక్రయిస్తున్నారు.
ఆర్థిక రాజధాని ముంబైలో బంగారం 22 క్యారెట్లది 10 గ్రాములకు రూ.53,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.58,040 పలుకుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53, 200తో విక్రయిస్తున్నారు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,356 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,430తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.53,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.58,040తో విక్రయిస్తున్నారు.
వెండి ధరలు కూడా అదే స్థాయిలో పతనం అవుతున్నాయి. దాదాపు రూ.500 మేర తగ్గి ప్రస్తుతం కిలో వెండి రూ.75,500తో విక్రయిస్తున్నారు. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.73,000తో విక్రయిస్తున్నారు. చెన్నైలో రూ.75,500, బెంగుళూరులో 71,250, హైదరాబాద్ లో రూ.75,500తో విక్రయిస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతోనే వీటి ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.