Homeబిజినెస్New Car: జీతం తక్కువైనా కారు కొనొచ్చు.. ఇలా ప్లాన్‌ చేస్తే మంచి కారు మీ...

New Car: జీతం తక్కువైనా కారు కొనొచ్చు.. ఇలా ప్లాన్‌ చేస్తే మంచి కారు మీ సొంతం!

New Car: మధ్య తరగతి ప్రజలకు కారు కొనడం అనేది ఓ డ్రీమ్‌. అందుకే తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్‌ చేస్తూ కారు కొనాలని ఆశపడుతుంటారు. అయితే కారు కొనాలంటే కనీసం రూ.5 లక్షలైనా పెట్టాల్సిందే. అయితే భారత్‌లో చాలా మంది ఉద్యోగుల నెలవారీ ఆదాయం రూ. 50 వేల కంటే తక్కువగా ఉంది. ఎంత తక్కువ ధరలో కారు కొనాలన్నా కనీసం రూ.5 లక్షలు కావాలి. అయితే తక్కువ జీతం వస్తున్నా సరిగ్గా ప్లాన్‌ చేస్తే.. మంచి కారును మీరు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బడ్జెట్‌ ప్లానర్స్‌..

వేతనం రూ.50 వేలకన్నా తక్కువుంటే..
ఉదాహరణకు మీ జీతం రూ. 50,000 అనుకుందాం. ఈ జీతంలో మీ కారును ఏ బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు.. మీ జీతం రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటే, విశ్లేషకుల ప్రకారం మీరు రూ.5 నుంచి రూ.6 లక్షల రేంజ్‌లో కారును కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో మీ జీతం రూ. 45 వేలకన్నా తక్కువగా ఉందని అనుకుందాం. అప్పుడు మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం. ఈ జీతంలో మీరు కొత్త కారు కొనాలనే ఆలోచన చేయవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆదాయంలో కొత్త కారును కొనుగోలు చేస్తే, వారు ఈఎంఐ చెల్లించలేరు. కారు మెయింటెనెన్స్‌ కూడా కష్టంగా ఉంటుంది. ఇంకా కొత్త కార్లపై పన్నులు ఎక్కువగా ఉంటాయి. నెలకు రూ.50 వేల కంటే ఎక్కువ సంపాదిస్తే రూ. 5 నుంచి రూ.6 లక్షల ధరలో కార్లను కొనుగోలు చేయవచ్చు.

కారును ఎంచుకోవడం ముఖ్యం..
రూ.50 వేలకుపైగా వేతనం ఉన్నవారు కారు కొనేముందు ఎంచుకోవడం ముఖ్యం.
ఇందుకు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత చెల్లించాలనుకుంటున్నారో ముందే ఓ నిర్ణయానికి రావాలి. ఈ ఫార్ములా పేరు 20–4–10. మీరు ఈ ఫార్ములాను అనుసరించి కొత్త కారును కొనుగోలు చేస్తే, మీరు ఎటువంటి సమస్య లేకుండా ఈఎంఐ చెల్లించగలరు. 20–4–10 ఈ ఫార్ములా గురించి చెప్పాలంటే.. మీరు కారును కొనుగోలు చేసినప్పుడు మీరు కారు ధరలో 20 శాతం ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కారు ధర రూ. 5 లక్షలు అయితే మీరు చేతి నుంచి అడ్వాన్స్‌గా కనీసం రూ.లక్ష చెల్లించాలి. తర్వాత నాలుగేళ్లు ఈఎంఐ చెల్లించగలగాలి. మీ అర్హత ప్రకారం మీరు నెలవారీ ఈఎంఐ చెల్లించవచ్చు.

ఈఎంఐ మీచేతుల్లోనే..
ఈఎంఐ ఎంత చెల్లించాలనేది అడ్వాన్స్‌ చెల్లింపుపై ఆధారపడి ఉంటుంది. ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో 10 శాతం మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు రూ. 50 వేల జీతం పొందే వ్యక్తి.. కారు ఈఎంఐ నెలకు రూ. 5 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మీరు 20 శాతం డౌన్‌ పేమెంట్‌తో రూ.5 లక్షల విలువైన కారును కొనుగోలు చేసి, 4 సంవత్సరాలపాటు నెలకు రూ.5 వేల చొప్పున ఈఎంఐ చెల్లిస్తే, ఆ కారు పూర్తిగా మీ సొంతం అయినట్లే. ఇందుకోసం మీరు ముందుగా చేయవలసిన పని ఒకటి ఉందని గమనించాలి. నెలవారీ ఆదాయంలో 10 శాతం ఈఎంఐ ఎంత చెల్లించాలో లెక్కించాలి. ఆ తర్వాత మీరు కారు కోసం ఎంత డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలో గణాంకాలు వేసుకోండి. రూ.5 లక్షల విలువైన కారును సొంతంగా కొనుగోలు చేయాలనుకుంటే, అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular