https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. అడ్వాన్స్ తీసుకునే ఛాన్స్..?   

కరోనా, లాక్ డౌన్ ఆంక్షల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో వేతన జీవులకు ఊరట కలిగేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక శాఖ పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి కొంత మొత్తం అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. 2020 కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు ఇలాంటి సదుపాయాన్నే కల్పించి ప్రయోజనం చేకూర్చింది.   కరోనా సెకండ్ వేవ్ వల్ల ఉద్యోగులు పడుతున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 31, 2021 / 09:45 PM IST
    Follow us on

    కరోనా, లాక్ డౌన్ ఆంక్షల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో వేతన జీవులకు ఊరట కలిగేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కార్మిక శాఖ పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి కొంత మొత్తం అడ్వాన్స్ గా తీసుకునే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. 2020 కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు ఇలాంటి సదుపాయాన్నే కల్పించి ప్రయోజనం చేకూర్చింది.

     

    కరోనా సెకండ్ వేవ్ వల్ల ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో నాన్ రిఫండబుల్ కొవిడ్ అడ్వాన్స్‌ ను కేంద్రం ప్రవేశపెట్టింది. మూడు నెలల బేసిక్, డీఏ వేతనాన్ని లేదంటే పీఎఫ్‌లో 75 శాతం డబ్బుల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఉద్యోగులు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.

     

    గతేడాది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న వాళ్లు సైతం ఈ ఏడాది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 15వేల లోపు వేతనం ఉన్నవాళ్లు ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర కార్మిక శాఖ రూ. 18,698.15 కోట్లు చెల్లించి 76.31 లక్షలకు పైగా కొవిడ్-19 అడ్వాన్స్ క్లైములను పరిష్కరించింది. అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడు రోజుల్లోపే కేంద్ర కార్మిక శాఖ రుణాలను మంజూరు చేస్తోంది.

     

    కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగాలకు మేలు చేకూరనుండగా మరోవైపు కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం లక్షన్నర కేసులు నమోదయ్యాయి. జూన్ నెలాఖరు నాటికి కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.