Enviro Infra Engineers IPO: ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో) నవంబర్ 22 నుంచి 26 వరకు బిల్డింగ్ దరఖాస్తులు స్వీకరించింది. ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ ప్రకారం బిడ్డింగ్ మొదటి రోజు తర్వాత పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే 20 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అయింది. భారత స్కాట్ మార్కెట్‌లో ట్రెండ్ రివర్స్ కావడం, భారత ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి బలమైన ప్రతిస్పందన రావడంతో గ్రే మార్కెట్‌లో ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ షేర్ ధర పెరిగింది. ఈ గ్రే మార్కెట్‌లో ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ లిమిటెడ్ షేర్లు రూ.55 ప్రీమియం వద్ద ట్రేడ్ అయ్యాయి.
ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ జీఎంపీ..
ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఐపీవో జీఎంపీ (గ్రే మార్కెట్ ప్రీమియం) రూ.55. ఇది సోమవారం జీపీఎం రూ.53తో పోలిస్తే రూ.2 ఎక్కువ. గత ఐదు రోజుల్లో ఎన్విరో ఇన్‌ప్రా ఇంజినీర్స్ ఐపీవోకు సంబంధించిన గ్రే మార్కెట్ సెంటిమెంట్లు పెరగడానికి దలాల్ స్ట్రీట్ ట్రెండ్ రివర్స్, ఇన్వెస్టర్ల నిర్ణయాత్మక ప్రతిస్పందన ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ఐపీఓ సమీక్ష..
లక్ష్మిశ్రీ ఇన్వెస్టిమెంట్ అండ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అన్షుల్ జైన్ ఈ పబ్లిక్ ఇష్యూకు సబ్ స్రైబ్ ట్యాగ్ ఇచ్చారు. ఎన్విరో ఇన్‌ప్రా ఐపీవో బిడ్డింగ్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం 115 శాతం పెరిగింది. పన్ను తర్వాత లాభం రెట్టింపుకన్నా ఎక్కువ అయింది. పన్ను తర్వాత లాభం రెట్టింపు కన్నా ఎక్కువ అయింది. అయితే, ఇటీవలి త్రైమాసిక ఫలితాలు ఆదాయం, పీఏటీలో కొంత క్షీణత చూపాయి. అదనంగా కంపెనీ ఆస్తులు క్యూ1 ఎఫ్‌వో 25లో రూ.761.90 కోట్ల నుంచి రూ.812.87 కోట్లకు పెరిగాయి. నికర రుణాలు కూడా 235 కోట్ల నుంచి 305 కోట్లకు పెరిగాయి.
నేడు ఐపీవో కేటాయింపు..
ఎన్విరో ఇన్‌ప్రా ఇంజినీర్స్ ఐపీవో షేర్ కేటాయింపు బుధవారం(నవంబర్ 27న) ఖరారు అయ్యే అవకాశం ఉంది. పెటుట్బడిదారుల లాటరీ ప్రాతిపదికన షేర్లు పొందుతారు. మొత్తం ప్రక్రియను రిజిస్ట్రార్ పర్యవేక్షించారు. కేటాయింపు తేదీల్లో, పెట్టుబడిదారులు చేసినబిడ్‌లకు వ్యతిరేకంగా తమకు కేటాయించిన షేర్ల సంఖ్య తెలుసుకుంటారు. రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉన్నాయి.