https://oktelugu.com/

Emergency Loan: అత్యవసర సమయంలో డబ్బు కావాలంటే ఇలా ఈజీగా పొందవచ్చు..

కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే అత్యవసర సమయాల్లో ఈజీగా డబ్బు పొందవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2024 12:28 pm
    Follow us on

    Emergency Loan: మనిషి ఎంత సంపాదించినా.. ఎన్ని ఆస్తులున్నా.. అత్యవసర సమయానికి డబ్బు అందకపోతే వ్యర్థమే. చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. అయితే నగదు వ్యవహారాల్లో అవగాహన లేనివారు డబ్బు ఉన్నా అత్యవసర సమయంలో తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే అత్యవసర సమయాల్లో ఈజీగా డబ్బు పొందవచ్చు. ఒకప్పుడు డబ్బు అవసరం వచ్చినప్పుడు ఇతర వ్యక్తులను అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఇతరులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో కొన్ని సంస్థలు అత్యవసర సమయాల్లో డబ్బును అందిస్తున్నాయి. అవేంటంటే?

    కొంత మంది డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్ డ్ డిపాజిట్ ( Fixed Deposit) చేస్తారు. ఎక్కవ వడ్డీ రావాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు. అత్యవసరం ఏర్పడినప్పుడు వీటిని రిలీజ్ చేయరాదు. ఇలాంటప్పుడు ఎఫ్ డీలపై రుణం తీసుకోవచ్చు. అంటే బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లను రిలీజ్ చేయకుండా వాటిపై 70 నుంచి 80 శాతం రుణం ఇస్తాయి. అయతే ఫిక్స్ డ్ డిపాజిట్ పై 7 శాతం వడ్డీ ఇస్తే.. వీటిపై రుణం తీసుకుంటే మాత్రం 8 శాతానికి పైగా వడ్డీ విధిస్తారు. అయితే రుణం తీసుకున్నా.. ఎఫ్ డీ పై వచ్చే వడ్డీ ఆగదు.

    అత్యవసర సమయంలో బంగారం రుణాలు కూడా ఉపయోగపడుతాయి. వ్యక్తిగత రుణాల కంటే బంగారం రుణాలపై తక్కువ వడ్డీని విధిస్తాయి. దీంతో కొంతకాలం పాటు అవసరాలు తీర్చుకోవడానికి ఈ సౌకర్యం ఎంతో అనువుగా ఉంటుంది. పైగా శుభకార్యాల్లో తప్ప బంగారం ఇతర సమయాల్లో ధరించడానికి ఇష్టపడరు. ఇలాంటప్పుడు వీటిపై రుణం తీసుకోవడం వల్ల అవి సేఫ్ గా ఉండడమే కాకుండా అవసరాలను తీరుస్తుంది. బంగారం 50 నుంచి 70 శాతం రుణం లభిస్తుంది. వీటిపై 8 నుంచి 9శాతం వడ్డీని విధిస్తారు.

    నేటి కాలంలో చాలా మంది ఇన్సూరెన్స్ చేసే ఉంటారు. అయితే ఒక్కోసారి సరైన సమయానికి డబ్బు అందనప్పుడు ఇన్సూరెన్స్ బాండ్ పై కూడా రుణం తీసుకోవచ్చు. ఈ బాండ్లపై బ్యాంకులు 90 శాతం వరకు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే సకాలంలో రుణం చెల్లించకపోతే మాత్రం పాలసీ రద్దు అయ్యే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్లు, షేర్లపై కూడా రుణం తీసుకోవచ్చు. వీటిని తాకట్టు పెట్టి బ్యాంకులో 50 శాతం వరకు సాయం పొందవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్ల విలువ తగ్గినప్పుడు అదనపు పెట్టుబడులకు డిమాండ్ చేయొచ్చు. లేకుంటే వాటిని విక్రయించే ఛాన్స్ ఉంది.