Elon Musk
Elon Musk: ప్రపంచ కుబేరుడు… దిగ్గజ పారిశ్రామికవేత్త.. టెస్లా కార్ల తయారీ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ సోమవారం చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ఈ ట్వీట్ ద్వారా ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చాడు.
ఎందుకంటే..
ప్రపంచ నంబర్ వన్ కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్ జీపీటీ చాట్‌బాట్‌ను వినియోగించుకునేందుకు ఓన్ ఏఐతో ఒప్పందం చేసుకుంది. ఈమేరకు సోమవారం ప్రకటన చేసింది. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ – 2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
ఓన్ ఏఐ ఎవరిదంటే..
యాపిల్ ఒప్పందం చేసుకున్న ఈ ఓన్‌ఏఐ మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టిన సంస్థ. తాజా ఒప్పందంతో మైక్రోసాఫ్ట్ షేర్లు పుంజుకున్నాయి. ఈ కాన్ఫరెన్స్‌లో మరిన్ని ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడి దారులకు నిరాశ పర్చింది.
ఒప్పందాన్ని వ్యతిరేకించిన మస్క్..
ఇదిలా ఉంటే ఓపెన్‌ఏఐతో ఒప్పందాన్ని టెస్లా సీఈవో మస్క్ వ్యతిరేకించారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స ఖాతాలో పోస్ట్ చేశారు.
సరికొత్త పోస్టర్‌తో..
ఇక ఈ ట్వీట్‌కు మస్క్ ఓ సినిమా పోస్టర్‌ను ఎంచుకున్నాడు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ ఫొటోపై పడింది. ఇంతకీ ఆ పోస్టు చూస్తే ఇండియన్ సినిమాకు చెందినదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించి చర్చించడం మొదలు పెట్టారు.
కోలీవుడ్ సినిమా పోస్టర్..
ఇక మస్ట్ పోస్టు చేసిన ఆ పోస్టర్ కోలవుడ సినిమాకు చెందినది. పాత సినిమాదే అయినా.. దానిని తాజాగా మస్క్ షేర్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఫొటో సినిమా పోస్టర్ తప్పట్టం లోనిది. మస్క్ ట్వీట్‌పై తమిళ నిర్మాత ఆదం బవ రిప్లయ్ కూడా ఇచ్చారు. తన సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa
— Adham Bava (@adham_bava) June 11, 2024
— Elon Musk (@elonmusk) June 10, 2024
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Elon musk shares this meme from tamil movie to trash iphone chatgpt deal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com