Elon Musk : ప్రపంచంలో విజేతగా నిలవాలని కొందరు బిజినెస్ మెన్స్ కలలు కంటుంటారు. ఈ కలను కొందరు మాత్రమే సాకారం చేసుకుంటారు. ఇందు కోసం విభిన్న రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎలాన్ మస్క్ ఒకరు. వరల్డ్ లెవల్లో ఫేమస్ అయిన వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఎప్పటికి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని అనుకుంటారు. స్పేస్ ఎక్స్ ద్వారా ఇప్పటికే టాప్ 10 బిజినెస్ మెన్స్ లో నిలిచారు. అయితే ఆ స్థానాని దిగజారాలని అనుకోవడం లేదు. అందుకోసం ఎలెన్ మస్క్ ఊహకందని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తనదగ్గరున్న డబ్బు బలంతో ట్విట్టర్ ను చేజిక్కించుకున్న మస్క్ ఇప్పుడు దాని రూపు రేఖలు మార్చేయాలని చూస్తున్నాడు. అందుకోసం ఏం చేశాడో తెలుసా?
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. సంచలనాల నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఎలాన్ మస్క్ గత సంవత్సరం 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి దానిని X corp అనే సంస్థలో విలీనం చేశాడు. గత ఏప్రిల్ లో కొత్త సీజీవో లిండా యాకారినో నియమితులైన సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ట్విట్టర్లో మార్కులు వేగవంతంగా ఉంటాయని పేర్కొన్నాడు. ఇప్పటికే ఉద్యోగులను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన ఇప్పుడు ట్విట్టర్ లోగోను కూడా మార్చాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం ట్విట్టర్ లోగో బ్లూ కలర్లో పిట్ట ఎగురుతున్న లోగో ఉంది. దీని స్థానంలో షిబా ఇను అనే కుక్క లోగో మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని మార్కెట్ విలువకు 4 బిలియన్ డాలర్లు ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ లోగోను చేర్చాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మస్క్ ను కొందరు లోగో ట్విట్టర్ లోగో మారుస్తున్నారా? అని అడగగా దానికి అయన అవును అనే సమాధానం ఇచ్చాడు. దీంతో త్వరలోనే ఈ లోగో మార్చే ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ చేతికొచ్చిన తరువాత ట్విట్టర్ నష్టాల్లో కొనసాగుతోంది. ట్విట్టర్ బ్లూ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ నెలకు 8 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. ఇది గతంలో కంటే చాలా తక్కువ ఆదాయం. ఈనెలలో ట్విట్టర్ ఆదాయం కూడా బాగా పడిపోయినట్లు సమాచారం.
అయితే గత ఏప్రిల్ లోనూ ఈ ప్రయత్నం చేయగా చాలా విమర్శలు వచ్చాయి. దీంతో పాత లోగోనే ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ బ్లూ బర్డ్ ద్వారా ఆదాయం పెరడం లేదు. పైగా షిబా ఇను అనే కుక్క లోగోకు బాగా డిమాండ్ ఉండడంతో ఇక లోగో మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలుపెడుతారనేది మాత్రం ఎలాన్ మస్క్ వెల్లడించలేదు. ఒకవేళ ఆ పనులు స్పీడ్ అప్ అయతే త్వరలో ట్విట్టర్ కు పిట్ట బొమ్మకు బదులు కుక్క బొమ్మ వచ్చే అవకాశం ఉంది.