https://oktelugu.com/

Elon Musk: మస్క్‌ సంపాదన మామూలుగా లేదుగా.. నిమిషానికి ఎన్ని లక్షలంటే..?

మస్క్‌ ఆదాయం గతేడాది రూ.3.623 బిలియన్‌ డాలర్లు (రూ.3,00,55,42,28,745.00)ఉండగా ఆ ఏడాది అతని నిమిషంయ సంపాదన రూ.5,71,668 ఉందని తెలిపింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 16, 2024 / 01:36 PM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk: ప్రపంచ కుబేరుల్లో ఒకరు టెస్లా అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌. ఈయన గురించి పరిచయం అవసరం లేదు. భారీగా ఆదాయం సంపాదిస్తున్న మస్క్‌ నిమిషానికే రూ.5.71 లక్షలు సంపాదిస్తున్నారు. ఈమేరకు ఫోర్బ్స్‌ పత్రిక వరల్డ్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వివరాలు వెల్లడించింది.

    నిమిషానికే లక్షల సంపాదన..
    మస్క్‌ ఆదాయం గతేడాది రూ.3.623 బిలియన్‌ డాలర్లు (రూ.3,00,55,42,28,745.00)ఉండగా ఆ ఏడాది అతని నిమిషంయ సంపాదన రూ.5,71,668 ఉందని తెలిపింది. ఇక గతేడాదికన్నా.. నికర సంపద తగ్గినప్పటికీ ప్రపంచ కుబేరుల్లో ఒకరిగానే కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌(74) ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు.

    ఇవీ మస్క్‌ వ్యాపారాలు..
    ఇక మస్క్‌ క్వీన్స్‌ యూనివర్సిటీలో చదువుకున్నాడు. పారిశ్రామికవేత్తగా, ఇంజినీర్‌గా, ఆవిష్కర్తగా రానిస్తున్నారు. స్పేస్‌ ఎక్స్, పేపాల్, టెస్లా మోటార్స్, హైపర్‌లూప్, సోలార్‌సిటీ, ఓపెన్‌ ఏఐ వంటి వ్యాపారాలు చేస్తున్నారు. త్వరలో భారత్‌లో కూడా టెస్లా కార్ల తయారీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు భారత్‌ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి నాటికి టెస్లా కార్లు భారత రోడ్లపై పరుగు పెట్టడం ఖాయం.