Electric Scooters: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, నిజంగా పెట్రోల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం డబ్బులను ఆదా చేస్తుందా.. మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన బజాజ్ చేతక్, ఓలా ఎస్1 ప్రో వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు మీ డబ్బును ఎంత ఆదా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం!
బజాజ్ ఆటో ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ 35 సిరీస్‌ను విడుదల చేసింది. మరోవైపు, ఓలా ఎలక్ట్రిక్ తన పాపులర్ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో మూడవ తరం మోడల్‌ను విడుదల చేసింది. బజాజ్ చేతక్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో, ఓలా ఎస్1 ప్రో 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ రెండు స్కూటర్లు రోజుకు 40 కిలోమీటర్లు నడిపితే ఎంత ఆదా చేస్తాయో చూద్దాం.
ఈ స్కూటర్ల రన్నింగ్ కాస్ట్ తెలుసుకునే ముందు.. వాటి మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన తేడాలను పరిశీలిస్తే… ఓలా ఎస్1 ప్రో 3 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన స్కూటర్ ధర రూ. 1,12,999 నుండి ప్రారంభమవుతుంది. ఇక బజాజ్ చేతక్ 3501 ప్రారంభ ధర రూ.1,29,743. రేంజ్ విషయానికి వస్తే, ఓలా ఎస్1 ప్రో ఒకే ఛార్జ్‌పై 176 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. బజాజ్ చేతక్ 3501లో కంపెనీ 153 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తోంది. ఓలా ఎస్1 ప్రో గంటకు 117 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను కలిగి ఉంది. అయితే బజాజ్ చేతక్ 3501 గరిష్ట వేగం గంటకు 73 కిలోమీటర్లు మాత్రమే.
ఇప్పుడు ఈ రెండు స్కూటర్లను రోజుకు 40 కిలోమీటర్లు నడిపితే ఏది ఎక్కువ డబ్బు ఆదా చేస్తుందో తెలుసుకుందాం. పెట్రోల్ స్కూటర్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని, విద్యుత్ యూనిట్ ధర దాదాపు రూ.7గా పరిగణిస్తే, ఓలా ఎస్1 ప్రో దాని మెరుగైన ఆన్-రోడ్ రేంజ్ కారణంగా పెట్రోల్ స్కూటర్ ఖర్చుతో పోలిస్తే నెలకు రూ.3,287 ఆదా చేస్తుంది. ఏడాదికి ఈ ఆదా రూ.39,444 అవుతుంది. బజాజ్ చేతక్ 3501 నెలకు రూ.2,140 ఆదా చేస్తుంది. వార్షికంగా ఈ ఆదా రూ.26,006గా ఉంటుంది. దీని ప్రకారం, రోజువారీ ప్రయాణాలకు ఓలా ఎస్1 ప్రో బజాజ్ చేతక్ కంటే ఎక్కువ డబ్బు ఆదా చేయగలదు. అయితే, ఇది కేవలం రన్నింగ్ కాస్ట్ మాత్రమే. కొనుగోలు ధర, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.