Homeబిజినెస్Electric Plasma Stove: గ్యాస్ అవసరం లేకుండానే.. ఈ స్టవ్ నుంచి మంట పుడుతుంది

Electric Plasma Stove: గ్యాస్ అవసరం లేకుండానే.. ఈ స్టవ్ నుంచి మంట పుడుతుంది

Electric Plasma Stove: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల వంటగ్యాస్ కు విపరీతమైన కొరత ఏర్పడింది. చాలా వరకు దేశాలు గ్యాస్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాయి. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరి నేపథ్యంలో.. కొంతలో కొంత సడలింపు లభించినప్పటికీ.. అది ఆశించిన స్థాయిలో అయితే కాదు.

గ్యాస్ కొరత నేపథ్యంలో మన దేశంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇండక్షన్ స్టవ్ ల విషయంలో స్టార్ రేటింగ్ లేకుండానే సరఫరాకు నిర్ణయించింది. రేటింగ్ జారీ ని ఆరు నెలల వరకు పొడగించింది. ఐదు కిలోల సామర్థ్యం ఉన్న గ్యాస్ సిలిండర్ లను తయారు చేయడం మొదలుపెట్టింది.. ఇంకా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంది. పౌర సరఫరాల శాఖ అధికారులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేసింది.

గ్యాస్ కొరత నేపథ్యంలో కొత్త కొత్త ఉత్పత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా గ్యాస్ అవసరం లేకుండానే మంటను పుట్టించే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ మార్కెట్లోకి త్వరలో రాబోతోంది. ఇది విద్యుత్ ద్వారా పనిచేస్తుంది. గాలి మొత్తాన్ని అయనీకరణం చేస్తుంది. 1300 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇండక్షన్ స్టవ్ మాదిరిగా కాకుండా దీనిపై అన్ని రకాల గిన్నెలను పెట్టుకొని వంట చేసుకోవచ్చు. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. సోలార్ పవర్ ద్వారా దీనిని వాడేవారికి మరింత ఉపయోగం. దీని ధర దాదాపు 35వేల వరకు ఉంటుంది.

ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ భవిష్యత్తు కాలంలో గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో గల్ఫ్ దేశాల నుంచి చమురు, సహజ వాయువు ఇతర దేశాలకు దిగుమతి అవుతుంది. గల్ఫ్ దేశాలలో పరిస్థితులు వచ్చే రోజుల్లో ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే ఆయిల్ రిఫైనర్ల మీద ఆయా దేశాలు దాడులు చేసుకుంటున్న. ఆయిల్ రిఫైనరీ దెబ్బతింటే.. ఫ్యూయల్ సేకరణ ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల ప్రపంచ దేశాలకు సరఫరా చేయడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు తారస్థాయికి చేరుతాయి.

అందువల్లే ఎలక్ట్రిక్ ప్లాస్మా స్టవ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనేక రకాల ప్రయోగాల తర్వాత దీనిని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. దీని ధర 35 వేల వరకు ఉన్నప్పటికీ.. జీవితాంతం దీనిని వాడుకునే అవకాశం ఉంటుంది. పైగా ఎటువంటి ప్రమాదాలు ఉండదు. లీకేజీ భయం ఉండదు. అన్ని రకాల గిన్నెలను ఏర్పాటు చేసుకొని వంటలు చేసుకోవచ్చు. దీనివల్ల సిలిండర్ల కొరత ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular