https://oktelugu.com/

Ear Buds: డిమాండ్ ఉన్న ఈ ఐటమ్ లో లేటెస్ట్ బెస్ట్ ఇవే !

Ear Buds:  మీకు తెలుసా ? ఇయర్‌ బడ్స్‌ కోసం నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. పైగా ఎక్కువమంది ఎక్కువసార్లు కొంటున్న ఐటమ్స్ లో ఈ ఇయర్‌ బడ్స్‌ కూడా ఒకటి అట. మరి అంత డిమాండ్ ఉన్న ఈ ఇయర్‌ బడ్స్‌ కి సంబధించి ఏది బెస్ట్, లేటెస్ట్ ఎదో చెప్పాలి కదా. అందుకే.. మీ కోసం ఇయర్‌ బడ్స్‌ లో కొత్త రకం సరుకు గురించి వివరంగా రాసుకొచ్చాం. మరి చదువుకోండి. నచ్చితే.. చక్కగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 04:05 PM IST
    Follow us on

    Ear Buds:  మీకు తెలుసా ? ఇయర్‌ బడ్స్‌ కోసం నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. పైగా ఎక్కువమంది ఎక్కువసార్లు కొంటున్న ఐటమ్స్ లో ఈ ఇయర్‌ బడ్స్‌ కూడా ఒకటి అట. మరి అంత డిమాండ్ ఉన్న ఈ ఇయర్‌ బడ్స్‌ కి సంబధించి ఏది బెస్ట్, లేటెస్ట్ ఎదో చెప్పాలి కదా. అందుకే.. మీ కోసం ఇయర్‌ బడ్స్‌ లో కొత్త రకం సరుకు గురించి వివరంగా రాసుకొచ్చాం. మరి చదువుకోండి. నచ్చితే.. చక్కగా కొనుక్కోండి.

    Ear Buds

    మీడియం బడ్జెట్‌ లో మంచి క్వాలిటీ ఇయర్‌ బడ్స్‌ కావాలనుకునేవారికి ఆసక్తిని కలిగిస్తోంది నోకియా ఇయర్‌బడ్స్‌. నోకియా నుండి కొత్తగా వచ్చిన నోకియా లైట్‌ BH-205 ఇయర్‌బడ్స్‌. ముందువైపు నాలుగు ఎల్‌ఈడీ లైట్లతో బ్యాటరీ ఇండికేటర్‌, ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో, గూగుల్‌, సిరి, అలెక్సా సపోర్ట్‌తో పాటు 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో ఇవి అందుబాటులో ఉన్నాయి. ధర రూ.2,799 కాగా నోకియా ఫ్యాన్స్‌ని ఇట్టే ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు.

    Also Read: మీరు అందంగా ఆరోగ్యంగా ఉండాలా ? ఐతే మీ కోసమే.. !

     

    Earbuds

    అలాగే సోనీ కొత్త ఇయర్‌ బడ్స్‌ కూడా సూపర్‌ గా ఉన్నాయి. సంగీత ప్రియులకి సోనీ బ్రాండ్‌ అంటే అమితాసక్తిగా ఉంటుంది. ఈ కంపెనీ నుండి ఎటువంటి అప్‌డేట్స్‌ వచ్చినా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇటీవలే సోనీ సరికొత్త ఇయర్‌ బడ్స్‌ని ప్రవేశపెట్టింది. WF 1000XM4గా వచ్చిన ఈ ఇయర్‌ బడ్స్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌లో, అత్యుత్తమ సంగీతాన్ని చేరవేయడంలో సూపర్‌ అనిపించుకుంటోంది. 32 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న వీటి ధర సుమారు రూ. 20 వేల వరకు ఉంటుంది.

    Also Read: ఐపీఎల్ మెగా వేలంలో ఎవరికి ఎంత రేటు? ఎంత మందంటే?

    Tags