కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై ఎంత రుణం పొందవచ్చో తెలుసా.. ఎవరు అర్హులంటే?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు తీపికబురు చెప్పింది. రైతులు, మత్స్య పరిశ్రమకు చెందినవారు, పాడిపరిశ్రమ, పశువుల పెంపకందారులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు రాబోయే మూడు నెలలలో ఏకంగా రెండు కోట్ల మందిని కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ను అమలు చేస్తోంది. నవంబర్ నెల 15వ తేదీ నుంచి 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు […]

Written By: Navya, Updated On : November 18, 2021 10:01 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు తీపికబురు చెప్పింది. రైతులు, మత్స్య పరిశ్రమకు చెందినవారు, పాడిపరిశ్రమ, పశువుల పెంపకందారులకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయడంతో పాటు రాబోయే మూడు నెలలలో ఏకంగా రెండు కోట్ల మందిని కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ను అమలు చేస్తోంది.

నవంబర్ నెల 15వ తేదీ నుంచి 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలు జరగనుంది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఈ స్కీమ్ ను మొదలుపెట్టారు. 2018 – 19 బడ్జెట్‌లో రైతులు, మత్స్యకారులకు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. కేంద్రం ఇస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డుల సహాయంతో రైతులు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే 1,60,000 రూపాయల రుణాన్ని పొందవచ్చు.

ప్రభుత్వం ఏకంగా 50 లక్షల మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించడానికి సిద్ధమవుతోంది. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య రంగాల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రైతుల ఆదాయంను పెంచడంలో ఈ రంగాలు ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. సమీపంలోని బ్యాంకులను సంప్రదించి అర్హులైన రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.

ఎస్బీఐ బ్యాంక్ శాఖకు వెళ్లి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ ఆన్ లైన్ నుంచి ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, ఇంటి చిరునామా, దరఖాస్తుదారుడి ఫోటోలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.