Compact Suv Cars: కారు కొనాలని భావించే చాలా మంది కాంపాక్ట్ ఎస్ యూవీ పై ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు కేవలం హ్యాచ్ బ్యాక్ కార్లకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు సైతం తమ మనసు మార్చుకొని కాంపాక్ట్ కార్లను కోరుకుంటున్నారు. బెస్ట్ ఫీచర్స్ తో పాటు సౌకర్యంగా ఉండే ఈ మోడళ్లను కంపెనీలు సైతం ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల మూడు మోడళ్ల కార్ల కోసం వినియోగదారులు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిగా వీటి సేల్స్ విషయంలో ఈ మూడు మోడల్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సేల్స్ ను పెంచుకున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవంటే?
ప్రత్యేకంగా కాంపాక్ట్ ఎస్ యూవీలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావడంలో కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి. ఈ జాబితాలో హ్యుందాయ్, మారుతి, కియా కంపెలు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతి నుంచి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కార్లు బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలనకు చెందిన కొన్ని మోడళ్లు అమ్మకాల్లో ఒకదాని తరువాత మరొకటి వరుసగా నిలిచాయి. వీటి అమ్మకాలను పరిశీలిస్తే..
2024-24 ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా అమ్మకాలను పరిశీలిస్తే 1,62,773 యూనిట్లు ఉన్నాయి. ఆ సంవత్సరం మార్చిలో అత్యధికంగా 16,458 యూనిట్లు అమ్ముడుపోయాయి. కానీ ఇదే సంవత్సరం డిసెంబర్ లో 9,243 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో క్రెటాకు మారుతికి చెందిన గ్రాండ్ విటారా గట్టి పోటీ ఇచ్చింది.
మారుతి గ్రాండ్ విటారా సేల్స్ విషయానికిస్తే ఈ ఫైనాన్స్ ఇయర్ లో 1,21,169 యూనిట్లు విక్రయించింది. గత జనవరిలో అత్యధికంగా 13,438 కార్లను అమ్మింది. డిసెంబర్ లో 6,988 యూనిట్లు విక్రయించింది. గత డిసెంబర్ లో క్రెటా అమ్మకాలు తగ్గినా.. దాని కంటే గ్రాండ్ విటారా పై చేయి సాధించింది.
పై రెండు మోడళ్ల తరువాతి స్థానాన్ని ఆక్రించింది. కియా సెల్టోస్. కాంపాక్ట్ ఎస్ యూవీలో బెస్ట్ కారుగా నిలిచిన దీని అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 1,00,423 యూనిట్లు ఉన్నాయి. ప్రతీ నెల 8,369 యూనిట్లను విక్రయించుకుంటూ వస్తోంది. పై రెండు మోడళ్లను బీట్ చేయకపోయినా వినియోగదారులను మాత్రం ఆకట్టుకుంటోంది.