https://oktelugu.com/

Best Cars: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. ఇచ్చే ఈ కార్ల గురించి తెలుసా?

దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిలో ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎప్పటికీ స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 11, 2024 / 06:11 PM IST

    Best Cars

    Follow us on

    Best Cars: కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కార్లు ఉండేవి. కానీ ఇప్పుడు సామాన్యులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తక్కువ ధరకే కార్లను అందిస్తున్నాయి. చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా కేవలం రూ.5 లక్షల లోపు మోడళ్లను తీసుకొస్తున్నాయి. దీంతో మధ్యతరగతి పీపుల్స్ సొంతంగా కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తక్కువ ధరకు కార్లను కొనుగోలు చేయాలనుకున్నా.. ఎక్కవ మైలేజ్ ఇచ్చే వాటి కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే అలాంటి కార్లు ఏవో తెలుసుకుందాం..

    దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిలో ఉంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఎప్పటికీ స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. మారుతి సుజుకీ స్విప్ట్ 2023 డిసెంబర్ లో 11,843 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2022 డిసెంబర్ లో 12,061 అమ్మకాలు జరుపుకుంది. అంటే స్విప్ట్ ఆకర్షించే డిజైన్ తో పాటు తక్కువ ధరను కలిగి ఉంది. దీనిని రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అలాగే ఇది లీటర్ పెట్రోల్ కు 22 నుంచి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

    మారుతి కంపెనీకి చెందిన మరో మోడల్ బాలెనో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల వరుసలో ఉంది. ఇది లీటర్ పెట్రోల్ కు 22 నుంచి 30 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. 2023 డిసెంబర్ లో దీని అమ్మకాలు 10,669 గా ఉన్నాయి. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. దీనిని రూ.6.61 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇక వ్యాగన్ ఆర్ సైతం లీటర్ పెట్రోల్ కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.54 లక్షల ఎక్స్ షో రూం ధరతో విక్రయిస్తున్నారు.

    దేశంలో అగ్రగామిలో ఉన్న హ్యుందాయ్ కూడా హ్యాచ్ బ్యాక్ కార్లను అందిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీకి చెందిన ఐ 10 లీటర్ పెట్రోల్ కు 16 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.5.84 లక్షల తో విక్రయిస్తున్నారు. 2023 డిసెంబర్ లో 5,247 యూనిట్లు అమ్ముడుపోయాయి. టాటాకు చెందిన టియాగో గత నెలలో 4,852 యూనిట్లు విక్రయించారు. దీనిని రూ.5.60 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.8.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు.