రూ.5 లక్షల లోపు ఉన్న ఈ 5 కార్ల గురించి తెలుసా?

గతంలో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ఉన్న కార్లు ఇప్పుడు రూ.5 లక్షల లోపు ఇంటికి తీసుకొచ్చుకునే విధంగా అందుబాటులో ఉన్నాయి. . ప్రస్తుతం రూ.5 లక్షల్లో ఉన్న టాప్ 5 కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా?

Written By: Chai Muchhata, Updated On : June 16, 2024 2:10 pm

5 lack Rupees cars

Follow us on

నేటి కాలంలో పలు అవసరాల నేపథ్యంలో కారు తప్పనిసరిగా మారుతోంది. దీంతో చాలా మంది 4 వెహికల్ ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కంపెనీలు సైతం కార్ల ఉత్పత్తిని పెంచాయి. అయితే ఒకప్పుడు కారు కొనాలంటే ధరను చూసి భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. గతంలో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా ఉన్న కార్లు ఇప్పుడు రూ.5 లక్షల లోపు ఇంటికి తీసుకొచ్చుకునే విధంగా అందుబాటులో ఉన్నాయి. . ప్రస్తుతం రూ.5 లక్షల్లో ఉన్న టాప్ 5 కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా?

బజాజ్ కంపెనీకి చెందిన ‘క్యూట్’ కారు నాలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 217 సీసీ ఇంజిన్ తో పనిచేస్తూ 11.13 బీహెచ్ పీ పవర్, 16.19 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఫ్యూయెల్ కలిగిన దీనిని రూ.2.64 లక్షల నుంచి రూ.2.84 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

దేశంలోని నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది మారుతి సుజుకీ కంపెనీ. దీని నుంచి రిలీజ్ అయిన ఆల్టో కే 10 మోడల్ 8 వేరియంట్లలో లభిస్తోంది. ఈ కారు 998 సీసీ ఇంజిన్ తో పనిచేస్తూ 55.66 బీహెచ్ పీ పవర్, 82.99 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఫ్యూయెల్ కలిగిన ఈ కారు ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 వరకు విక్రయిస్తున్నారు.

ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎస్ ప్రెస్సో 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది998 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో పనిచేస్తున్న ఇందులో 56.66 బిహెచ్ పీ పవర్ తో పాటు 82.89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును రూ.4.27 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

రెనాల్ట్ కంపెనీకి చెందిన క్విడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 67 బీహెచ్ పీ పవర్ తో పాటు 91 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్ కు 22 నుంచి 23 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ధర రూ.4.70 లక్షల నుంచిరూ.6.33 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆధారంగా పనిచేస్తుంది.

దేశంలోని కార్ల అగ్రకంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన శాంట్రో కారు 9 వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఫ్యూయెల్ కలిగిన ఇదిందులో 59 బీహెచ్ పీ పవర్ తోపాటు 86 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 20.3 నుంచి 30.6 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారును రూ.4.87 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.