Bank Account: ఒకప్పుడు అంటే అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేవి కాదు. పైగా నగదు లావాదేవీలు ఈ స్థాయిలో జరిగేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బ్యాంకులలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ఖాతాలు ఉంటున్నాయి. ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. చాలామందికి స్మార్ట్ ఫోన్లు ఉండడంతో.. వారంతా కూడా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు.
డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఖాతాల నుంచి నగదు లావాదేవీలు నిర్వహించడం పెరిగిపోయింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్య ఇక్కడే వస్తోంది. వాస్తవానికి దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బ్యాంకు నగదు లావాదేవీల పరిమితులు తెలియకుండా వ్యవహరిస్తే ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతాలో 10 లక్షలు, కరెంట్ ఖాతాలో 50 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అంతకుమించితే మాత్రం కచ్చితంగా ఆదాయపు పన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్ డిపాజిట్ 10 లక్షలు , ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో రెండు లక్షల మాత్రమే పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో 30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు పది లక్షల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు.
ఇటీవల కాలంలో చాలామంది బ్యాంకింగ్ నిబంధనలు మొత్తం ఉల్లంఘిస్తున్నారు. నగదు లావాదేవీల విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న నిబంధనలలో లొసుగులను ఆసరాగా చేసుకుని నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటువంటి వారిని పట్టుకోడానికి ఆదాయపు పన్ను శాఖ నిత్యం రెడీ గానే ఉంటుంది. ఈ క్షణమైన సరే దాడి చేసి సినిమా చూపిస్తుంది. అందువల్లే నగదు లావాదేవీలు నిర్వహించేవారు సాధ్యమైనంత వరకు నిబంధనలకు లోబడి నడుచుకోవాలి. లేకుంటే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి.