https://oktelugu.com/

Discount Cars : దసరా, దీపావళి వరకు ఆగాల్సిన అవసరం లేదు.. ఇప్పుడే భారీ డిస్కౌంట్ ప్రకటించిన కార్ల కంపెనీ..

ఆరా అనే మోడల్ పై రూ. 35 వేల తగ్గింపును ప్రకటించారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ.10 వేలు, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా కింద రూ. 3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2024 / 04:32 PM IST

    Hyundai car discount

    Follow us on

    Discount Cars : కారు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ డిస్కౌంట్ కోసం ఎదురుచూస్తారు. అయితే పండుగలు, ప్రత్యేక సీజన్లలో మాత్రమే ఆఫర్లు ఇస్తుంటారు. ముఖ్యంగా దసరా, దీపావళి సందర్భంగా కార్లకు డిస్కౌంట్లు ప్రకటిస్తారు.  కానీ కొన్ని కంపెనీలు తమ సేల్స్ పెంచుకోవడానికి సాధారణ రోజుల్లో సైతం తగ్గింపు ధరతో విక్రయిస్తుంటారు. అయితే తగ్గింపు అంటే అంతా ఇంతా కాదు.. ఏకంగా లక్షల రూపాయలు తగ్గింపు ధరతో విక్రయిస్తారు. తాజాగా  కొన్ని కార్లపై భారీ తగ్గింపు ఇస్తున్నారు.ఆ వివరాల్లోకి వెళితే..

    హ్యుందాయ్ కంపెనీ తమ కార్లపై తగ్గింపును ప్రకటించింది. ఈ కంపెనీకి  చెందిన అల్కజార్ అనే వెహికల్ పెట్రోల్, డీజిల్ మోడళ్లపై పై రూ.15,000, ఎక్చేంజ్ ఆఫర్ కింద రూ.20,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే టక్సన్ పెట్రోల్ మోడల్ పై రూ.50వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. డీజిల్ మోడల్ పై ఏకంగా రూ. 2 లక్షలు తగ్గించి ఇస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన 2024 వెన్యూ మోడల్ పై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ఈ మోడల్ పై రూ.30 వేల నగదు తగ్గింపుతో పాటు రూ.25 వేల ఎక్చేంజ్ బోనస్ అందిస్తున్నారు.

    గ్రాండ్ i10 2024 మోడల్ కారుపై రూ.28,000 తగ్గింపును ప్రకటించారు. ఇది మాన్యువల్, నాన్ సీఎన్ జీ కార్లకు వర్తిస్తుంది. అలాగే ఆటోమేటిక్ కార్లపై రూ.18,000, సీఎన్ జీ మోడళ్లపై రూ.43,000 తగ్గింపుతో విక్రయించనున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ.10 వేలు ఉన్నాయి. అలాగే ఫ్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ కింద రూ.3 వేలు తగ్గించనున్నారు. హ్యుందాయ్ ఐ 10 కారుపై రూ. 25 వేల తగ్గింపు ధరతో విక్రయించనున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.10 వేలు తగ్గింపుతో ఇస్తున్నారు.

    ఇదే కంపెనీకి చెందిన ఆరా అనే మోడల్ పై రూ. 35 వేల తగ్గింపును ప్రకటించారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్చేంజ్ బోనస్ రూ.10 వేలు, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా కింద రూ. 3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వెర్నా కారుపై మొత్తం రూ.55 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూర.25 వేల వరకు తగ్గింపును ప్రకటించారు.