Discount Cars:కారులో తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ కలను కొందరు మాత్రమే నెరవేర్చుకుంటారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్లతో తిరగాలని ఆశ పడుతుంటారు. కానీ ఎంత చిన్న కారు కొనుగోలు చేయాలనుకున్నా.. రూ.5 లక్షల కంటే ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి కార్లపై డిస్కౌంట్ అనగానే చాలా మంది ఆసక్తి చూపుతారు. పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కంపెనీలు ఆఫర్లు పెట్టి రూ.లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తాయి.కానీ రూ.2 లక్షల తగ్గింపుతో కారును ఎవరైనా విక్రయిస్తారా? కానీ ఇలా చేస్తే మీరు ఏ కారు కొన్నా రూ.2 లక్షల తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు..
సాధారణంగా ఏ కారును కొనుగోలు చేయాలనుకున్నా.. డిస్కౌంట్ ఎంత ఉందో చూస్తాం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా..సాధారణ రోజుల్లో రూ.50 వేలకు మించి ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వరు. కానీ ఈ కార్లకు మాత్రం రూ.2 లక్షల తగ్గింపు ఇస్తారు. ఎందుకంటే ఇవి డెమో కార్లు కాబట్టి. డెమో కార్లు అనగానే అవి ప్రత్యేకమైన కార్లు కాదు.. అలాగని సాధారణ కార్ల కంటే ఇవి ఏమాత్రం తక్కువ ఫీచర్స్, ఇంజిన్ ను కలిగి ఉండవు. అయితే ఇవి స్కిక్కర్ తీసేసిన కార్లు అని గుర్తుంచుకోవాలి.
అంటే ఏదైనా షోరూంకు వెల్లి కారు కొనాలని అనుకుంటే టెస్ట్ డ్రైవ్ కోసం డెమో కార్లను ఉంచుతారు. వీటిని కొన్ని సందర్భాల్లో కంపెనీలు విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల రూ.2 లక్షల వరకు తగ్గింపు ఇస్తారు. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ డెమో కార్లు కొత్తవి అనుకొని పొరపాటు చేయొద్దు. అవి ఎన్ని కిలోమీటర్లు తిరిగాయి? ప్రస్తుతం ఎలా ఉంది? అనేవి చూసుకోవాలి. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్ కార్లు 1000 కిలోమీటర్ల కు పైగా తిరిగితే దాని విలువ 2 శాతం తగ్గుతుంది. ఈ తరుణంలో కారు ధర తగ్గుతుంది.
ఉదాహరణఖు రూ. 6లక్షల టెస్ట్ డ్రైవ్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటే.. ఆ కారు 5 వేల కిలోమీటర్ల వరకు తిరిగి ఉంటే దీని ధరపై రూ.10 శాతం తగ్గుతుంది. అంటే రూ.60 వేల వరకు తగ్గుతుంది. అలాగే 10 వేల కిలోమీటర్ల వరకు రన్ అయితే రూ.1.20 వేల వరకు తగ్గుతుంది. ఇలా రీడింగ్ పెరిగిన కొద్ది కారు విలువ తగ్గి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఇక రూ.12 లక్షల విలువైన కారు 10 వేల కిలోమీటర్ల వరకు తిరిగితే దానిపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. అంటే రూ.2,40,000 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.