Discount Car:కారు కొనాలనుకునే వారికి రెనాల్ట్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగలు, ప్రత్యేక రోజులతో సంబంధం లేకుండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఒక్కో కారుపై ఏకంగా రూ.50 వేల వరకు ఆఫర్ అందించడంతో వినియోగదారులు ఆకర్షణకు గురవుతున్నారు. కొత్తగా కారు కొనేవారితో పాటు పాత కారును ఎక్చేంజ్ చేసుకునేవారికి ఇది బంఫర్ ఆఫర్ అని అంటున్నారు. లేటేస్టుగా కొన్ని కార్లు ప్రకటించిన ఆఫర్లకు వినియోగదారులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ డిస్కౌంట్లు ఎలా ఉన్నయో చూద్దాం..
రెనాల్ట్ కంపెనీకి చెందిన కార్లంటే కొందరు అత్యంత ఎక్కువగా లైక్ చేస్తారు. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే పాపులర్ మోడల్ కిగర్ పై రూ.40 వేల డిస్కౌంట్ పు ప్రకటించింది. ఇందులో రూ.15,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 కార్పొరేట్ బోనస్, రూ.15,000 ఎక్చేంజ్ బోనస్ కను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు మార్చి నెలాఖరు వరకే ఉంటాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇదే కంపెనీకి చెందిన ట్రైబర్ పై రూ.35,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ బోనస్ రూ.10,000, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15,000 పొందవచ్చు.
ఈ కంపెనీకి చెందిన క్విడ్ ను ఎక్కువ మంది ఆదరించారు. ఈ మోడల్ సేప్టీ పరంగా చూస్తే ది బెస్ట్ అని అనిపించుకుంది. మంచి డిజైన్ ను కలిగిన ఈ కారు పై రూ.35,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇందులో రూ.10,000 నగదు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అలాగే రూ.10,000 రాయల్టీ బోనస్, రూ.15,000 ఎక్చేంజ్ బోనస్ ను ప్రకటించారు. ఈ కారును ప్రస్తుతం రూ.4.70 లక్షల ప్రారంభ నుంచి రూ.6.45 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ఇప్పటి వరకు రెనాల్ట్ కంపెనీ వివిధ ఆకట్టుకునే ఫీచర్లతో మోడళ్లు వచ్చాయి.అయితే వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు తాజాగా కొత్త మోడళ్లపై డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ డిస్కంట్లను చూసి వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అయితే మార్చి నెల తరువాత ఈ ఆఫర్లు వర్తించవని కంపెనీ తెలిపింది.