Digital Transactions: ప్రాంతాలు మారుతున్నాయి.. చెల్లించే నగదు మారుతోంది. కానీ చెల్లించే విధానం మాత్రం ఒకే విధంగా ఉంది. అందువల్లే డిజిటల్ లావాదేవీలలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. కోవిడ్ కంటే ముందే డిజిటల్ లావాదేవీలు మొదలైనప్పటికీ.. కోవిడ్ సమయంలో తారస్థాయికి చేరుకున్నాయి. కోవిడ్ రోజుల్లో బ్యాంకులు మూసి ఉండడంతో ప్రజలు అనివార్యంగా డిజిటల్ లావాదేవీలవైపు వెళ్లిపోయారు.. డిజిటల్ లావాదేవీలు సులభంగా ఉండడం.. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండడంతో.. ప్రజలు అత్యంత ఈజీగా డిజిటల్ విధానంలో లావాదేవీలను కొనసాగిస్తున్నారు. మొదట్లో పేటీఎం మాత్రమే డిజిటల్ లావాదేవి సంస్థగా ఉండేది. ఆ తర్వాత ఫోన్ పే.. అమెజాన్ పే.. గూగుల్ పే.. వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ప్రజలు తమకు నచ్చిన యాప్ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
Also Read: ఇండియా ఏ టీం ఇదే.. ఇందులో రాణిస్తేనే జాతీయ జట్టుకు.. కరణ్ నాయర్, జురెల్ కి ఛాన్స్
డిజిటల్ లావాదేవీల వల్ల..
డిజిటల్ లావాదేవీలవల్ల మనదేశంలో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య గతంతో పోల్చి చూస్తే చాలా వరకు తగ్గింది. ఇక ఏటీఎం ల వినియోగం కూడా చాలావరకు తగ్గుముఖం పట్టింది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడంతో ఏటీఎంలో నుంచి నగదును ఉపసంహరించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఉచిత లావాదేవీలపై పరిమితుల విధించింది. దీనికి తోడు ఇంటర్ చేంజ్ ఫీజులను కూడా పెంచింది. ఫలితంగా ఏటీఎంలకు వెళ్లడానికి ఖాతాదారుడు అతిగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో గత ఏడాది దేశవ్యాప్తంగా 5,484 ఏటీఎంలు మూతపడ్డాయి. 2023లో దేశవ్యాప్తంగా 2,19, 882 ఏటీఎంలో ఉన్నాయి. 2024 నాటికి ఆ సంఖ్య 2,14,398 కి పడిపోయింది. ఇక కొన్ని బ్యాంకులయితే తమ ఖర్చు తగ్గించుకోవడానికి ఏటీఎంలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. గ్రామీణ స్థాయి బ్యాంకులు అయితే ఏటీఎంలను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రజలను ఎక్కువగా డిజిటల్ లావాదేవీల వైపు మరలే విధంగా చేస్తున్నాయి. అందువల్లే మనదేశంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోతుంది. భవిష్యత్తు కాలంలో ఏటీఎంల సంఖ్య మరింత పడిపోయినా ఆశ్చర్యపవలసిన అవసరం లేదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ” వచ్చే రోజుల్లో ఏటీఎంలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు.. డిజిటల్ లావాదేవీలలో రోజురోజుకు కొత్త కొత్త విధానాలు తెరపైకి వస్తున్నాయి. ప్రతి వ్యాపారి కూడా కచ్చితంగా డిజిటల్ విధానంలో పేమెంట్లు స్వీకరించడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే వచ్చే రోజుల్లో నగదు అనేది అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. అంతిమంగా మోసాలకు తావులేని.. అసమానతలకు ఆస్కారం లేని ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. కాకపోతే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఈ స్థాయిలో డిజిటల్ లావాదేవీలను పెంపొందించుకోవడం గొప్ప విషయమని” ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.