https://oktelugu.com/

Digital Payments : డిజిటల్ చెల్లింపుల్లో భారతీయుల ముందంజ.. నగదురహిత దేశంగా మారనుందా?

. డిజిటల్ చెల్లింపుల్లో అమెరికా కంటే భారత్ ముందున్నట్లు గతంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ సమావేశంలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ చెల్లింపులు ఎలా ఉన్నాయంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : February 12, 2024 / 12:33 PM IST

    digital payment

    Follow us on

    Digital Payments : భారతదేశం పూర్తిగా డిజిటల్ మయంగా మారుతోంది. ఒకప్పుడు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడిన భారత్ ఇప్పుడు వేగంగా శక్తివంతమైన దేశంగా దూసుకుపోతుంది. ఇక్కడ ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని చేపట్టినా ప్రజలు దానికి కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా సాంకేతికను ఉపయోగించుకోవడంలో భారతీయులు మిగతా దేశాల కంటే ముందున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో అమెరికా కంటే భారత్ ముందున్నట్లు గతంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ సమావేశంలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ చెల్లింపులు ఎలా ఉన్నాయంటే?

    ఆర్థిక లావాదేవీలు జరపాలంటే ఒకప్పుడు బ్యాంకులను సంప్రదించాల్సి వచ్చేంది. గంటల కొద్దీ నిలబడితే గానీ అనుకున్న పని అయ్యేది కాదు. ఆంతేకాకుండా చేతిలో ఒక్కోసారి డబ్బు ఉండే పరిస్థితి కాదు. దీంతో ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినప్పటి నుంచి వినియోగదారులు సులభంగా డబ్బు పంపించుకుంటున్నారు. అలాగే బిల్లుల చెల్లింపులోనూ ఇప్పుడు సౌకర్యవంతంగా మారింది. దీంతో చిన్ని చిన్న కిరాణా షాపుల్లోనూ మొబైల్ తో డబ్బులు పే చేస్తున్నారు.

    ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆ తరువాత ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అయ్యారు. అంటే భారత్ లో డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు వేగంగా అభివృద్ధి చెందాయి. 2022 ఏడాదిలో మైగవ్ ఇండియా విడుదల చేసిన ప్రకారం భారత్ 8,950 కోట్ల డిజిటల్ చెల్లింపులు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత బ్రెజిల్ నిలిచింది. చైనా మూడో స్థానంలో, థాయ్ లాండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ముందు ముందు భారత్ మరింతగా డిజిటల్ చెల్లింపులు చేస్తూనగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆ వెబ్ సైట్ పేర్కొంది.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ప్రకారం దేశం మొత్తంలో 15 రాష్ట్రాల్లో మాత్రమే డిజిటల్ చెల్లింపులు సజావుగా సాగాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. యూపీఐ లావాదేవాల సంఖ్య 2017లో 1.8 కోట్లు కాగా.. 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. 2017 నుంచి 2023 వరకు 12.1 శాతానికి తగ్గిపోయింది. ఇదే మయంలో డిజిటల్ చెల్లింపులు 2004 రేట్లు పెరిగిందని ఎస్బీఐ పేర్కొంది.