Ban On Diesel Cars: ఈ 10 పాపులర్ కార్ల డీజిల్ వెర్షన్లు ఇక కనిపించవు

998 సీసీ, 81.8 బీహెచ్ పీ పవర్ తో నడిచే హ్యుండాయ్ వెన్యూ పెట్రోల్, డీజిల్ వెర్షన్లో మార్కెట్లోకి విడుదలయింది. SUV లెవల్లో ఉండి ఆకట్టుకున్న ఈ కార్ల అమ్మకాలు విపరీతంగా సాగాయి. ప్రస్తుతం దీని ఎక్స్ షో రూం ధర రూ.7.72 లక్షల నుంచి ఉంది. అయితే డీజిల్ వాహనాల బ్యాన్ నేపథ్యంలో ఈ కారు ఉత్పత్తి నిలిపివేయనున్నారు.

Written By: Chai Muchhata, Updated On : May 12, 2023 3:15 pm

Ban On Diesel Cars

Follow us on

Ban On Diesel Cars: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతుంది. అవసరానికి మించి ఫ్యాక్టరీలు, వాహనాలు పెరిగిపోవడంతో వాటి నుంచి వెలువడే ఉద్గారాలతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ క్రమంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి డీజిల్ తో నడిచే ఫోర్ వీలర్స్ ను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ఉపయోగించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఇదే సమయంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది.కాలుష్య నివారణ చర్యలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీజిల్ తో నడిచే వాహనాల ఉత్పత్తి నిలిచిపోనుంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ప్రముఖంగా నిలిచిన 10 కార్లు ఇక మార్కెట్లో కనిపించవు. మరి ఆ కార్ల వివరాలేంటో చూద్దాం.

హ్యుండాయ్ వెన్యూ:
998 సీసీ, 81.8 బీహెచ్ పీ పవర్ తో నడిచే హ్యుండాయ్ వెన్యూ పెట్రోల్, డీజిల్ వెర్షన్లో మార్కెట్లోకి విడుదలయింది. SUV లెవల్లో ఉండి ఆకట్టుకున్న ఈ కార్ల అమ్మకాలు విపరీతంగా సాగాయి. ప్రస్తుతం దీని ఎక్స్ షో రూం ధర రూ.7.72 లక్షల నుంచి ఉంది. అయితే డీజిల్ వాహనాల బ్యాన్ నేపథ్యంలో ఈ కారు ఉత్పత్తి నిలిపివేయనున్నారు.

Mahindra XUV300:
పెట్రోల్ లేదా డీజిల్ తో నడిచే Mahindra XUV300 1197 సీసీ ఇంజిన్ ను కలిసి ఉంది. 108 బీహెచ్ పీ వపర్ తో మూవ్ అవుతుంది. లీటర్ ఇంధనానికి 16.5 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. ఆకర్షణీయమైన లుక్ లో ఉండే Mahindra XUV300ను బ్యాన్ చేయనున్నారు.

కియా సోనెట్:
రూ.7.79 లక్షల ధర ప్రారంభమయ్యే ఈ మోడల్ కూడా ఇక మార్కెట్లో కనిపించదు. 998 సీసీ ఇంజన్, 81.86 బీహెచ్ పీ పవర్ తో కూడిన ఈ మోడల్ లీటర్ కు 18.4 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న కార్లలో ఇదొకటి. దీని ఉత్పత్తి నిలిపివేయనున్నారు.

మహీంద్రా స్కార్పియో:
వీఐపీలు ఎక్కువగా ఇష్టపడే ఈ మోడల్ రాయల్ లుక్ లో ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. 1997 సీసీ ఇంజిన్, 130 బీహెచ్ పీ పవర్ తో కూడుకొని ఉంటుంది. 6 నుంచి 7గురి సీటు సామర్థ్యం ఉన్న ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ ఫ్యూయల్ ఉంది. ఈ మోడల్ ఇక మార్కట్లో కనిపించే అవకాశం లేదు.

Tata Harrior:
1956 సీసీ ఇంజిన్, 167 బీహెచ్ పీ పవర్ తో కూడిన టాటా హరియర్ కొత్త కారు ఉత్పత్తిని నిలిపివేయనున్నారు. కేవలం డీజిల్ ప్యూయల్ ను మాత్రమే కలిగి ఉన్న ఇది లీటర్ కు 14.6 కిలో మీటర్ల మైలేజి ఇస్తుంది.

Mahindra Thar:
మహీంద్రా థార్ గురించి కార్లతో సంబంధం లేని వ్యక్తులకూ తెలుసు. దీనిని ప్రముఖ క్రికెటర్ ధోని ప్రమోట్ చేయడంతో పాపులారిటీ సాధించుకుంది. 1497 సీసీ ఇంజన్, 116 బీహెచ్ పీ పవర్ ను కలిగిన ఈ మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ లేదా డీజిల్ ఫ్యూయల్ ను కలిగి ఉంది. దీనిని కూడా బ్యాన్ చేయనున్నారు.

Toyota Innova Crista:
ఆకర్షణీయమైన లుక్ తో పాటు 7 సీటర్ లో మొట్ట మొదటిసారిగా మార్కెట్లో వచ్చిన టోయోటా ఇన్నోవా ఇప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంది. 2393 సీసీ ఇంజిన్, 147.51 బీహెచ్ పీ పవర్ ను కలిగి ఉన్న ఈ మోడల్ కంప్లీట్ డీజిల్ ఫ్యూయల్ ను కలిగి ఉంది. దీంతో ఈ మోడలన్ ను బ్యాన్ చేయనున్నారు.

మహీంద్రా XUV700:
మహీంద్రా కంపెనీ నుంచి ఆకర్షణీయమైన లుక్ ను కలిగి ఉన్న ఈ మోడల్ 1999 సీసీ ఇంజన్, 152 బీహెచ్ పీ పవర్ ను కలిగి ఉంది. పెట్రోల్ లేదా డీజిల్ ఫ్యూయల్ ను కలిగి ఉన్న ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయనున్నారు.

టయోటా ఫార్ట్యూనర్:
2694 సీసీ ఇంజిన్ తో పాటు 163 బీహెచ్ పీ పవర్ ను కలిగి ఉన్న టయోటా ఫార్ట్యూనర్ పెట్రోల్, డీజిల్ ఫ్యూయల్ ను కలిగి ఉంది. లీటర్ కు 10 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ మోడల్ ఉత్పత్తిని బ్యాన్ చేసే అవకాశం ఉంది.

ఇసుజు డి-మాక్స్:
ఓన్లీ డీజిల్ ఫ్యూయల్ కలిగి ఉన్న ఇసుజు డి మాక్స్ బ్యాన్ కానుంది. 2499 సీసీ ఇంజిన్, 77.77 బీహెచ్ పీ పవర్ తో కలిగి ఉన్న ఇది ఫ్యూచర్లో మార్కట్లో కనిపించే అవకాశాలు తక్కువే.