Aadhar Ration Link:  రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

Aadhar Ration Link: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ ధరకే ప్రజలకు రేషన్ సరుకులను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రేషన్ కార్డుతో ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని సూచనలు చేసింది. రేషన్ సరుకులు దుర్వినియోగం కాకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరం […]

Written By: Navya, Updated On : March 24, 2022 5:50 pm
Follow us on

Aadhar Ration Link: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీ ధరకే ప్రజలకు రేషన్ సరుకులను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం రేషన్ కార్డుతో ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని సూచనలు చేసింది. రేషన్ సరుకులు దుర్వినియోగం కాకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Aadhar Ration Link

2022 సంవత్సరం మార్చి 31వ తేదీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవడానికి చివరి తేదీ కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. 2022 సంవత్సరం జూన్ 30వ తేదీ రేషన్ కార్డులను ఆధార్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఇప్పటివరకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోని వాళ్లు వెంటనే లింక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: KCR Fight On The Center: రెండు వైపులా కేంద్రంపై కేసీఆర్ పోరు.. టీ బీజేపీ నేత‌లు ట్రాప్ లో ప‌డుతున్నారా..?

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలని అనుకుంటే రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలి. వలస కూలీలకు, కార్మికులకు ఈ స్కీమ్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉండగా అర్హతల ఆధారంగా రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉంటాయి.

రేషన్ కార్డును బట్టి పొందే ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయి. రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.

Also Read: IT Raids Tension In TRS: టీఆర్ ఎస్ నేత‌ల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గ‌ట్టిగానే డిసైడ్ అయిందా…?