Dangerous Things In Car : వేసవికాలం పూర్తిగా మొదలుకాకముందే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువకు వస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో మనుషులతో పాటు కొన్ని వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కార్లను వేసవిలో కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో కొందరు కార్లలో అనుకోకుండా కొన్ని వస్తువులు తీసుకెళ్తారు. కానీ వీటి వల్ల కార్లలో ఉన్న ఉష్ణోగ్రత కారణంగా పేలిపోవడం ఖాయమని కొందరు ఆటోమోబైల్ రంగ నిపుణలు అంటున్నారు. అందువల్ల ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కార్లలు ఉండకుండా చూడాలని అంటున్నారు. ఇంతకీ ఏ వస్తువులు అంటే?
కొంత మంది ఎండవేడి నుంచి తగ్గించుకునేందుకు సన్ గ్లాసులు వాడే అలవాటు ఉంటుంది. ఇవి బైక్ పై వెళ్లేవారు ఎక్కువగా ధరిస్తారు. కొందరు కార్లలో వెళ్తున్న వారు పెట్టుకుంటారు. అయితే వీటిని ధరించేవారు దగ్గరే ఉంచుకోవడం మంచిది. లేదా వీటిని కార్లలో తీసుకెళ్లినప్పుడు ఎండ పడని చోట ఉంచాలి. లేకుంటే ఇందులోని మెయిన్ గ్లాస్ బూతద్ధంలా పనిచేస్తి మంటలు వచ్చేలా చేస్తుంది. ధూమపానం చేసే అలవాటు ఉన్న వారు కోకోల్లలు. వీరు వెంట లైటర్లు తప్పనిసరిగా ఉంచుకుంటారు. వీటిని కార్లలో ఉంచుకోకుండా జేబులో ఉంచుకోవాలి. లేకుంటే ఇవి ఉష్ణోగ్రత పెరిగి పేలిపోయే అవకాశాలు ఎక్కువ.
ఇదివరకు వినియోగించినా లేదా పాడైపోయిన బ్యాటరీలను కార్లలో ఉంచకుండా జాగ్రత్త పడాలి. వీటిని పొరపాటున కార్లలో ఉంచినప్పుడు అత్యధిక ఉష్ణోగ్రతను గ్రహించి పేలిపోతాయి. స్ప్రేక్యాన్లు సైతం కార్లలో ఉంచడం ఏమాత్రం సేఫ్ కాదు. వీటిల్లో ఉండే స్పిరిట్ ఉష్ణోగ్రతను గ్రహించి ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఎండవేడికి ఇవి పేలిపోయే అవకాశం ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్లు సైతం కార్లలో ఉంచకుండా జాగ్రత్తగా ఉండాలి.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. అలాగే కార్లలో మద్యం నిల్వ చేయడం మరింత ప్రమాదకరం. ఎందుకంటే కారు వేడి అయినప్పుడు కార్పొనేటెడ్ డ్రింక్స్ ఉన్నవి పేలే అవకాశం ఉంది. అలాగే సన్ క్రీములు, మేకప్ సామగ్రి సైతం కార్లలో నిల్వ చేయొద్దు. ఎందుకంటే కారు ఎండలో ఉన్నప్పుడు వీటిపై ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలే అవకాశాలు ఎక్కువ. అందువల్ల కారు వాడేవారు ఈ వస్తువులను కార్లలో ఉండకుండా చూడాలి.