D-Mart: ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసర వస్తువులు లేకుండా ఉండదు. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి అయినా నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయక తప్పదు. ఒకప్పుడు ఇంటి వద్ద ఉండే కిరాణం షాపులోకి వెళ్లి అవసరమైన సామాను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య పెరగడంతో వారానికి ఒకసారి నిత్యవసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో పట్టణాలు, నగరాల్లో పెద్దపెద్ద కిరాణం స్టోర్స్ లో ఒకేసారి నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసేవారు. కానీ ఈ సమయంలో కొందరు నాణ్యతలేని వస్తువులను విక్రయించేవారు. అంతేకాకుండా ధరను వారికి ఇష్టం వచ్చినట్లు ప్రకటించేవారు. అయితే ప్రజలకు తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులను అందించాలని ఉద్దేశంతో ఓ వ్యాపారి D Mart సంస్థలను ఏర్పాటు చేశాడు. అసలు డి మార్ట్ అనే సంస్థల లక్ష్యం ఏంటి? ఎవరికోసం వీటిని స్థాపించారు?
Also Read: తన సినిమాల్లోని పాత బ్లాక్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్న చిరంజీవి..ఫ్యాన్స్ కి పండగే!
మార్కెట్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు.. ధరల విషయంలో తేడాను గుర్తించి సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వస్తువులను అందించాలనే ఉద్దేశంతో ధమని అనే వ్యాపారవేత్త డీ మార్ట్ సంస్థను స్థాపించాడు. ఈయన మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు. అలా 1980లోనే ఈ రంగంలోకి అడుగుపెట్టి కోట్ల రూపాయలు సంపాదించాడు. అయితే ఈ సమయంలో సామాజిక సేవ చేయాలన్నా దృక్పథం అతనిలో కలిగింది. ప్రజలకు తక్కువ ధరకు అందించే సంస్థలను నెలకొల్పాలని అనుకున్నాడు. ఈ క్రమంలో 2002 సంవత్సరంలో ముంబైలో మొదటి డీమార్ట్ స్టోర్ ను స్థాపించారు. ఆ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలతో సహా మొత్తం 11 రాష్ట్రాల్లో ప్రస్తుతం డి మార్ట్ సంస్థలు నెలకొల్పబడ్డాయి. ఢిల్లీతోపాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఈ సంస్థలకు ప్రజాదరణ ఎక్కువగా వచ్చింది.
ఈ సంస్థలు ఎక్కువగా సొంత భవనాల్లోని ఏర్పాటు చేయడంతో ఖర్చులు తగ్గి లాభాలు పెరిగాయి. అంతేకాకుండా స్థానికంగా ఉండే వారిని ఉద్యోగులుగా నియమించి ఉపాధి కల్పించారు. డి మార్ట్ స్టోర్లను అన్నింటిని అవెన్యూ సూపర్ మార్క్స్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లకు చేరువలో ఉంది. అలాగే డి మార్ట్ వ్యవస్థాపకుడు ధమని ఆస్తుల విలువ రూ. 21.3 బిలియన్లు. అంటే ఇండియన్స్ కరెన్సీ ప్రకారం 1.78 లక్షల కోట్లు.
Also Read: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథను పొలిటికల్ డ్రామాగా మార్చాడా..?
ఆయా సంస్థల్లో తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి రావడంతో చాలామంది ఈ స్టోర్లకు వెళ్తున్నారు. అంతేకాకుండా అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించడంతో ప్రజలకు ఇతర ప్రదేశాలకు వెళ్లే బాధ తప్పింది. దీంతో టైం సేవ్ అవుతుందని చాలామంది ఈ స్టోర్ లకు వస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను చెక్ చేసిన తర్వాత కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఎక్కువ రోజు నిలువ ఉండడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరుతుందని చెబుతున్నారు.