Credit card limit reduction reasons : ఈ క్రమంలో క్రెడిట్ కార్డు కంపెనీలను చాలామంది యూజర్లు క్రెడిట్ లిమిట్ పెంచాల్సిందిగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఒకవేళ సదరు బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డు లిమిట్ ను తగ్గిస్తే ఏమవుతుందో మీకు తెలుసా. ఒకవేళ మీకు అలా జరిగినట్లయితే మీరు ముందుగా ఆ బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేసి మీకు క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గడానికి గల కారణాన్ని అడిగి తెలుసుకోవాలి. మళ్లీ మీ కార్డు లిమిట్ పెంచాల్సిందిగా మీరు బ్యాంకుకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ప్రస్తుతం మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తగ్గడానికి గల కారణాలను తెలుసుకొని వాటికి భవిష్యత్తులో దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ మార్చి 2023 నాటికి రూ.4,072 కోట్లకు చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఒకవేళ కస్టమర్లు క్రెడిట్ కార్డు బకాయిలను ఆలస్యంగా చెల్లినిస్తున్నట్లయితే అటువంటి వారిని బ్యాంకు రిస్క్ కస్టమర్లుగా పరిగణిస్తుంది.
అటువంటి సమయంలో బ్యాంకులు సదరు కస్టమర్ బకాయిలను చెల్లించ లేడని భావించి అతని క్రెడిట్ కార్డు లిమిట్ ను తగ్గిస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉపయోగించే వాళ్లు కొంతమంది మినిమం డ్యూస్ చెల్లించి బాకిని మాత్రం తర్వాతి నెలకు క్యారీ చేస్తారు. అయితే వాళ్లు ఆ బాకీ మీద వడ్డీని చెల్లిస్తారు కాబట్టి ఒకటి రెండుసార్లు అలా అయితే పర్వాలేదు. అది మీకు ఉన్న క్రెడిట్ కార్డు కంపెనీకి లాభంగా మారుతుంది. కానీ ఇదే ఆ తర్వాత కూడా కొనసాగితే మీ బకాయిలు బాగా పెరిగిపోతాయి. మీరు అప్పుల ఊబిలో పడిపోతారు. అటువంటి సమయంలో క్రెడిట్ కార్డ్ లోన్ తిరిగి చెల్లించడం మీకు కష్టమవుతుంది. అప్పుడు అది కంపెనీకి కూడా రిస్క్ గా మారుతుంది. ఆ సమయంలో కంపెనీలు తమ యూజర్ల క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గించేస్తూ ఉంటాయి. మరి కొంతమంది యూసర్లు అవసరానికి మించి క్రెడిట్ కార్డు లిమిట్ వాడేస్తారు.
Also Read : జులై 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త చార్జీలు అమలు..
అటువంటి సమయంలో లిమిట్ లో వాడిన అమౌంట్ రేషియో అని యుటిలైజేషన్ రేషియో అని పిలుస్తారు. ఈ రేషియో ఎక్కువైన సందర్భాలలో కూడా మీకు క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి క్రెడిట్ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు అనుకున్నట్లయితే అతను ప్రతి నెల అందులో 80 నుంచి 95000 వాడుతున్నాడు అనుకుందాం. ఆ సమయంలో కంపెనీలు ఇటువంటి వ్యక్తులను ఎక్కువగా లోన్ తీసుకునే రిస్కీ యూసర్లుగా పరిగణిస్తాయి. అటువంటి సందర్భంలో కూడా కంపెనీలు క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గించేస్తాయి.