
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. సులువుగా రూ.2 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పించింది. ఒక పోటీలో పాల్గొనడం ద్వారా రూ.2 లక్షలు సులువుగా పొందవచ్చు. ఒక పోటీలో పాల్గొనడం ద్వారా విజేతలు ఈ డబ్బులను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తుండగా ఇందుకోసం స్పెషల్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది.
ఎవరైతే ఈ స్పెషల్ కాంటెస్ట్ లో పాల్గొని విన్ అవుతారో వాళ్లు సులువుగా రూ.2 లక్షలు పొందవచ్చు. మోదీ సర్కార్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఈ పోటీలో పాల్గొనాలని భావించే వాళ్లు వరల్డ్ నో టుబాకో డేలో భాగంగా పొగాకు వల్ల కలిగే నష్టాల గురించి ఒక వీడియోను తీయాల్సి ఉంటుంది. 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి షార్ట్ వీడియోను తీయాలి. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ఈ పోటీలో గెలిచిన విజేతలకు ఫస్ట్ ఫ్రైజ్ కింద ఏకంగా 2 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. సెకండ్ ప్రైజ్ కింద రూ.1.5 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.లక్ష పొందవచ్చు. వీళ్లతో పాటు మరో పది మంది 10,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. జూన్ 30 వరకు ఈ కాంటెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కేవలం 60 సెకన్ల వీడియో చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
https://www.mygov.in/task/short-film-making-contest వెబ్ సైట్ ద్వారా ఈ కాంటెస్ట్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ పోటీకి సంబంధించి సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు.