https://oktelugu.com/

SBI Debit Card: ఎస్బీఐ డెబిట్ కార్డ్ తో ఈఎంఐ చెల్లించవచ్చు.. ఎలా అంటే..?

SBI Debit Card: సాధారణంగా ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే కేవలం క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు సైతం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు ఈఎంఐ ద్వారా బిల్లులను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ల ద్వారా చేసే కొనుగోళ్లకు సైతం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 7, 2021 / 04:46 PM IST
    Follow us on

    SBI Debit Card: సాధారణంగా ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే కేవలం క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే ఈఎంఐ చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు సైతం డెబిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు ఈఎంఐ ద్వారా బిల్లులను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుండటం గమనార్హం.

    అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ల ద్వారా చేసే కొనుగోళ్లకు సైతం డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించే మొత్తాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. డెబిట్ కార్డ్ చెల్లింపులను ఈఎంఐగా మార్చుకోవడం కోసం మర్చంట్ స్టోర్ దగ్గర పీవోఎస్ మెషీన్ పై డెబిట్ కార్డును స్వైప్ చేయాలి. ఆ తర్వాత బ్రాండ్ ఈఎంఐ బ్యాంక్ ఈఎంఐ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన మొత్తం కాలపరిమితిని ఎంచుకోవాలి.

    పీఓఎస్ మెషీన్ అర్హతను చెక్ చేసి పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసిన తర్వాత అర్హతకు సంబంధించిన మొత్తం ఖాతాలో జమవుతుంది. నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ పై కస్టమర్ సంతకం చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ లో రిజిష్టర్ చేసిన నంబర్ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో లాగిన్ కావాలి. నచ్చిన వస్తువును ఎంపిక చేసుకుని పేమెంట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

    పేమెంట్ ఆప్షన్ నుంచి ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకుని తర్వాత ఎస్బీఐని ఎంచుకుని రుణ కాలపరిమితిని ఎంచుకోవాలి. ఎస్బీఐ లాగిన్ పేజీలో వివరాలను ఎంటర్ చేసి ఆర్డర్ ను బుక్ చేసుకోవచ్చు, ఈ విధంగా సులువుగా లోన్ తీసుకుని ఆర్డర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.