
గతేడాది కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి నెలలో కేంద్రం బంగారంపై సుంకాలు తగ్గించడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కానీ ఈ నెల 1వ తేదీ నుంచి బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడం గమనార్హం. మరో నెల రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ రానుండటంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
బంగారం కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి రేటు పరుగులు పెట్టనుందని ఈ ఏడాది డిసెంబర్ లోపు బంగారం ధరలు పెరగనున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధర 45 వేల రూపాయల నుంచి 46 వేల రూపాయల మధ్య ఉండగా డిసెంబర్ లోపు 9 వేల రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 55వేల రూపాయలకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా, భారత్ దేశాలలో డిమాండ్ పెరగడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. బంగారం ధర తగ్గిన సమయంలోనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.1,200 పెరిగింది.
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆలస్యంగా బంగారం కొనుగోలు చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది. బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి.