CNG Cars : కారు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ తక్కువ బడ్జెట్ లో వెహికల్ ను సొంతం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్లను కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారు. ఈ తరుణంలో పెట్రోల్ కారు కంటే CNG కార్లపై ఆసక్తి చూపుతున్నారు. కొన్ని కంపెనీలు సైతం CNG కార్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. వీటి ధరతో పాటు నిర్వహణ ఖర్చలు కూడా తక్కువగా ఉండడంతో డిమాండ్ ఏర్పడుతుంది. అయితే బెస్ట్ CNG కార్లు ఏవో తెలుసుకుందాం..
దేశంలో వివిధ వేరియంట్ల కార్లను అందుబాటులోకి తీసుకురావడంలో మారుతి కంపెనీ మందుంటుంది. అలాగే సీఎన్ జీ కార్లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మారుతి సుజుకీ నుంచి ఆల్టో కే 10 ఓ వైపు పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో బెస్ట్ కారుగా నిలిచింది. ఇది హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ చిన్న ఫ్యామిలీ అంతా కలిసి దూరపు ప్రయాణాలు చేయొచ్చు. ఇందులో సీఎన్ జీ కిట్ తో పాటు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సౌకర్యాన్ని ఇచ్చారు. దీనిని రూ.3.99 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.5.96 వరకు పొందవచ్చు.
మారుతికి గట్టి పోటీ ఇచ్చే కంపెనీ టాటా అని చెప్పవచ్చు. ఈ కంపెనీ నుంచి కూడా ఆల్టోజ్ అనే సీఎన్ జీ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే మారుతికి చెందిన బాలెనో, హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఆధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు సీఎన్ జీతో ఆకర్షిస్తుంది. దీనిని రూ.7.60 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నరు. హ్యుందాయ్ కి చెందిన ఎక్స్ టర్ ఫ్యామిలీకి అనుకూలమైన కారు. ఇందులో పెట్రోల్, సీఎన్ జీలతో పాటు SUVపెట్రోల్ సౌకర్యం కూడా ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో స్మూత్ డ్రైవింగ్ ఉంటుంది. దీనిని రూ.9.16 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి నుంచి మరో బెస్ట్ మోడల్ డిజైర్. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో ఆకట్టుకుంటుంది. పవర్ ట్రెయినర్ ఎంపికతో కూడిన ఇది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దీనిని రూ.8.44 లక్షలతో విక్రయిస్తున్నారు. లాంగ్ డ్రైవ్ చేయాలనుకునేవారు ఈ కారును ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు. ఇవే కాకుండా ఎన్నో సీఎన్ జీ కార్లు మార్కెట్లో అలరిస్తున్నాయి. అయితే మరీ ముఖ్యంగా పెట్రోల్ వేరియంట్ కంటే సీఎన్ జీ ఎంపికలో మైలేజ్ ఎక్కువ ఉంటుందన్న విషయం తెలిసిందే.