Citywise Gold Prices: బంగారం కొనాలని అనుకునేవారికి ఇది మంచి సమయం అనుకోవచ్చు. వరుసగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు కొనుగోళ్లు లేకపోవడంతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇలా వరుసగా వారం రోజుల్లో రూ. 3,000 వరకు బంగారం తగ్గింది. జూన్ 23న బంగారం ధరలు 22 క్యారెట్లు రూ.92,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,06,900గా నమోదైంది. అంటే దాదాపు రూ.3 వేల వరకు తగ్గింది. అయితే బంగారం మరింత తగ్గుతుందని కొందరు అంటుండంగా.. పెరిగే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. అటు వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: బిజినెస్ కోసం షాకింగ్ ఆఫర్ ఇచ్చిన SBI.. కేవలం 15 నిమిషాలలో రూ.5 కోట్ల లోన్ అందిస్తున్న SBI..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 28న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.97,420గా ఉంది. జూన్ 27న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,850తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.5,00 వరకు తగ్గింది. అటు 24 క్యారెట్ల బంగారం పై కూడా ఇదే స్థాయిలో తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.97,570గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.89,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.97,420 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.89,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.97,420తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.97,420తో విక్రయిస్తున్నారు.
Also Read: బిజినెస్ లో సక్సెస్ కావాలా? ఈ సీక్రెట్ తెలుసుకొని పాటించండి.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,07,800గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.200 వరకు తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,07,800గా ఉంది. ముంబైలో రూ.1,07,800, చెన్నైలో రూ.1,17,800 బెంగుళూరులో 1,07,800, హైదరాబాద్ లో రూ. 1,17,800 తో విక్రయిస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల కారణంగా బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోతున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం కొనసాగుతుండడంతో ప్రస్తుతం బంగారం కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అయితే మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.