Citroen Basalt offer: ప్రతి నెలా ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లకు తక్కువ ధరకే కార్లు కొనే మంచి అవకాశాలను అందిస్తాయి. ఈ నెలలో భారతదేశంలో తమ నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సిట్రోయెన్ ఇండియా కూడా అదిరిపోయే ఆఫర్‌లతో ముందుకు వచ్చింది. కంపెనీ మొదటి పాపులర్ కూపే SUV అయిన సిట్రోయెన్ బసాల్ట్ పై భారీగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఈ SUV పై మాత్రమే కాకుండా, C3, eC3, ఎయిర్‌క్రాస్ వంటి మోడల్స్‌పై కూడా అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తోంది.
సిట్రోయెన్ C3పై భారీ తగ్గింపు
సిట్రోయెన్ C3 కారుపై రూ.1.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ 2025 షైన్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. కంపెనీ క్యాష్, లాయల్టీ బెనిఫిట్‌లను అందిస్తోంది. ఈ కారు ధర రూ.6.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.10.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
Dark, daring, and designed to impress.The Citroën Basalt in Dark Mode. Range starts at just ₹8.32 lakh.
Also, stand a chance to win a Citroën Dark Edition + take home assured merchandise with every test drive!Book yours now: https://t.co/hpjFvorfJE#BrighterSideOfDark pic.twitter.com/dZ0AQ8zYG4
— Citroën India (@CitroenIndia) May 14, 2025
సిట్రోయెన్ eC3 కారుపై భారీగా ఆదా
కంపెనీ సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుపై రూ.40,000 వరకు ఆదా చేసుకునే మంచి అవకాశం ఉంది. అయితే, ఈ ఆఫర్ 2023 మోడల్స్‌పై మాత్రమే వర్తిస్తుంది. 2025 మోడల్‌పై ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్ లభిస్తోంది. ఈ కారు ధర రూ.12.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.13.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
సిట్రోయెన్ బసాల్ట్ పై 2.8 లక్షల వరకు తగ్గింపు
ఇది కంపెనీ మొదటి కూపే SUV. జూలై నెలలో ఈ కారుపై రూ.2.8 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే, ఈ ప్రయోజనం 2024 మ్యాక్స్ AT వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.8.32 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ.14.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
Sculpted like a dream. Styled to steal the spotlight. The Unthinkable, The Citroën Basalt. #CitroënBasalt #Citroen #CitroënIndia #Citroën pic.twitter.com/hNs6C2nNhz
— Citroën India (@CitroenIndia) June 12, 2025
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ పై రూ.65,000 తగ్గింపు
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కారుపై రూ.65,000 వరకు ఆదా చేసుకునే మంచి అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనం 2023 మోడల్స్‌పై మాత్రమే వర్తిస్తుంది. 2025 మోడల్ మ్యాక్స్ వేరియంట్‌పై క్యాష్, ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్‌లు లభిస్తున్నాయి. ధర విషయానికి వస్తే ఈ కారు బేస్ వేరియంట్‌కు రూ.8.62 లక్షలు(Ex-showroom), టాప్ మోడల్‌కు రూ.14.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది.
గమనిక: సిట్రోయెన్ కార్లపై లభిస్తున్న ఈ ఆఫర్లు జూలై 31, 2025 వరకు మాత్రమే వర్తిస్తాయి. ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని సిట్రోయెన్ డీలర్‌షిప్‌ను సంప్రదించాలి.
Citroen Basalt unveiled!
Like the design of Citroen’s new coupe-SUV? pic.twitter.com/5MBk9Wwp0i
— MotorOctane (@MotorOctane) March 27, 2024