Petrol car VS CNG car : ఈమధ్య కారు కొనడానికి చాలా మందికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే బైక్ లు ఏవీ లక్ష రూపాయలకు తక్కువ ఉండడం లేదు. అంతేకాకుండా బైక్ ఉంటే ఇద్దరు మాత్రమే జర్నీ చేయొచ్చు. అదే కారు ఉండడం వల్ల సొంత అవసరాలతో పాటు ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లొచ్చు. అందుకే చాలా మంది సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే బైక్ ఇచ్చినంత మైలేజ్ కారు ఇవ్వదు. బైక్ తో సమానంగా కారు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకోసం చిన్న పని చేయాలి. అదేంటంటే?
కారు కొనే ముందు దాని గురించి పూర్తి గా తెలుసుకోవాలి. ఎవరైనా దీనిని తీసుకునే ముందు మైలేజ్ గురించి ఎక్కువగా ఆరా తీస్తారు. కొందరు ఎక్కువగా ట్రావెల్ చేసేవారికి మైలేజ్ ఇంపార్టెంట్. దీంతో మైలేజ్ ఎక్కవ ఉన్న కార్ల గురించి అడుగుతారు. అయితే ఫ్యూయెల్ కంటే సీఎన్ జీని అమర్చుకోవడం వల్ల ఎక్కువ మైలేజ్ ను పొందవచ్చు. అంతేకాకుండా చాలా వరకు డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఫ్యూయెల్ కు వెచ్చించే మొత్తంలో సగం చెల్లిస్తే గమ్యాన్ని చేరవచ్చు. అదెలాగంటే?
ఒక కారు మైలేజ్ 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనుకుందా. లీటర్ పెట్రోల్ ధర రూ. 109.00 గా ఉంది. ఒక రోజులో 30 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.218.00 అవుతుంది. రోజుకు రూ.218 వెచ్చించినా.. నెలకు రూ.6,540 అవుతుంది. అంటే పెట్రోల్ తో కారులో డ్రైవ్ చేయడం వల్ల రూ.6,540 చెల్లిస్తున్నారు.
ఇదే సీఎన్ జీ విషయానికొస్తాం.. ఒక కిలో సీఎన్ జీ ధర రూ.75 గా ఉంది. ఒక కిలో సీఎన్ జీ పై 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనుకుందా. ప్రతిరోజూ 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి రూ.90 అవుతుంది. ఇలా ప్రతి నెలకు రూ.2700 అవుతుంది. అంటే పెట్రోల్ కంటే సీఎన్ జీ కారును ఉపయోగించడం వల్ల రూ.3,840 వరకు ఆదా చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పెట్రోల్ కంటే సీఎన్ జీ వల్ల ఎంతో లాభం అని తెలుస్తోంది.
అయితే దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు మాత్రం సీఎన్ జీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ప్రదేశాల్లో గ్యాస్ ఫల్లింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండకపోవచ్చు. పెట్రోల్ మాత్రం దాదాపు అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంటుంది. సిటీల్లో మాత్రమే జర్నీ చేసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా హైబ్రిడ్ ఇంజిన్ ఉన్న వారికి ఇలా ప్లాన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. అందుకే మార్కెట్లో ఎక్కువగా సీఎన్ జీ కార్లకు డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కువగా హైబ్రిడ్ కార్లు అందుబాటులోకి రావడంతో వాటి కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లోకల్ అవసరాలతో పాటు లాంగ్ ట్రిప్ వేసేవారికి ఇది చాలా ఉపయోగం. అయితే కేవలం కార్యాలయ అవసరాలకు మాత్రం సీఎన్ జీ ని వాడుకోవచ్చు. సీఎన్ జీ కార్ల ఉపయోగం వల్ల పర్యావరణం సమతుల్యంగా ఉండనుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More