Electric Scooter: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతుండగా ద్విచక్ర వాహనాల ఖరీదు ఎక్కువ కావడంతో కొంతమంది ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయలేకపోతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో కొత్తగా స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లపై ఊహించని స్థాయిలో అదనపు భారం పడుతుండటం గమనార్హం.
అయితే ఎవాన్ అనే కంపెనీ కొత్తగా స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. ఎవాన్ ఇ లైట్ పేరుతో ఈ కంపెనీ అందిస్తున్న స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర కేవలం 28 వేల రూపాయలు మాత్రమే కావడం గమనార్హం. ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర 30,000 రూపాయలకు అటూఇటుగా ఉండనుందని సమాచారం. తక్కువ దూరం ప్రయాణించాలని భావించే వాళ్లకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: ఎయిర్ హోస్టెస్‌గా అమ్మాయిలే ఎందుకు ఉంటారో తెలుసా..?
తక్కువ బరువుతో ఉన్న ఈ స్కూటర్ లిథియం, యాసిడ్ బ్యాటరీలతో పని చేస్తుండగా వాహనదారుడు లిథియం, యాసిడ్ బ్యాటరీలలో ఏ బ్యాటరీ కావాలో ఆ బ్యాటరీని ఎంచుకోవచ్చు. లైసెన్స్ లేకుండానే ఈ స్కూటర్ ను నడపవచ్చు. ఈ స్కూటర్ ను కొనుగోలు చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. రెండు సంవత్సరాల బ్యాటరీ వారంటీతో ఈ స్కూటర్ అందుబాటులోకి వస్తోంది.
సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొత్త స్కూటర్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
Also Read: ఏపీ ఎక్స్ ప్రెస్ ఎందుకు అంటుకుంది? మంటలు ఎందుకు వ్యాపించాయి.?