Nara Brahmani : తెలుగు సినిమా లెజెండ్ సీనియర్ ఎన్టీఆర్ మనువరాలిగా.. స్టార్ హీరో బాలకృష్ణ కూతురిగా.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం మాజీ సీఎం చంద్రబాబు కోడలిగా.. హెరిటేజ్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా.. ఇలా ఎటు చూసినా ఆమె సెలబ్రెటీనే. సాధారణంగా ఒక వ్యక్తికి అత్యున్నత స్థాయి పేరు సంపాదించినప్పుడు అతని వారసులు అంతటి గుర్తింపు వస్తుందని అస్సలు అనుకోవడానికి వీల్లేదు. కానీ నందమూరి వంశంలో జన్మించిన మూడు తరాల వారసులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వారు ఏ రంగంలో ఉన్న అనుకున్న విజయాలు సాధించి ఎన్టీఆర్ పేరును నిలబెడుతున్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం చెప్పుకోవాల్సిన ప్రముఖ వ్యక్తి నారా బ్రాహ్మణి. ఎన్టీఆర్ మనువరాలు అయిన బ్రాహ్మిణి సాధారణ మహిళ జీవితం గడిపితే ఇంత చర్చ ఉండేది కాదు. ఆమె ఎంచుకున్న రంగంలో విజయాలు సాధిస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు బ్రాహ్మిణి ఎందుకంత ప్రత్యేకం? ఆమె జీవితంలో జరిగిన ఆసక్తి విశేషాలేంటి?
1988 డిసెంబర్ 21న బాలకృష్ణ, వసుంధర దంపతులకు బ్రాహ్మిణి ముంబైలో జన్మించారు. అప్పట్లో సినీ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండడం వల్ల బ్రాహ్మిణి ప్రాథమిక విద్య మొత్తం అక్కడే సాగింది. ఆ తరువాత బాలకృష్ణ కుటుంబం హైదరాబాద్ కు తిరిగొచ్చిన తరువాత శ్రీ చైతన్య కళాశాలల ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సీబీఐటీలో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలో శాంటాకార యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసి అన్ని విభాగాల్లో టాప్ గ్రేడింగ్ సంపాదించారు. ఆ తరువాత ఎంబీఏ కోసం దరఖాస్తు చేసుకుంటే టాప్ కాలేజీలు ఆమెను ఆహ్వానించాయి. అయితే బ్రాహ్మిని స్టాన్ ఫోడ్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే అప్పటికే అందులో లోకేష్ చదువుతున్నాడు. అయితే వీరిద్దరు మూడునెలలు మాత్రమే కలిసి చదువుకున్నారు. ఆ తరువాత లోకేష్ హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు.
బ్రాహ్మిణి పర్సనల్ జీవితంలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. చిన్నప్పుడు తండ్రి బాలకృష్ణ తో కలిసి దగ్గర్లోని కేబీఆర్ పార్క్ కు జాగింగ్ కు వెల్లేవారట. అయితే వీరు వెళ్లే సరికి పార్క్ గేట్ తీయకపోవడంతో ముందుగా బాలయ్య తన కూతురును తన భుజాలపై ఎత్తుకొని గోడ దూకించేవారట. ఆ తరువాత బాలకృష్ణ కూడా గోడదూకి వాకింగ్ చేసేవారట. ఒకసారి బాలకృష్ణ, చంద్రబాబు కటుంబం కలిసి విహారయాత్రకువ వెళ్లారు. ఈ సమయంలో బ్రాహ్మిణి వసుంధర కడుపులో ఉన్నారు. ఈ సమయంలో 9 ఏళ్ల వయసులో ఉన్న లోకేష్ పాప ఎప్పుడు వస్తుంది? అని తెలిసీ తెలియని వయసులో అడిగేవారట. అలా అడిగిన 19 ఏళ్లకు వీరిద్దరు భార్యభర్తలు అయ్యారు.
లోకేష్ ను వివాహం చేసుకున్న తరువాత బ్రాహ్మిణి తన చదువును ఇంకా కొనసాగింది. ఇందుకోసం అమెరికాకు వెళ్లింది. అక్కడ చదువు పూర్తయిన తరువాత ఇండియాకు వచ్చిన బ్రాహ్మిణి వెంటనే హెరిటేజ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తుల్లో హెరిటేజ్ ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా గోల్డెన్ పికాక్ అవార్డు హెరిటేజ్ సంస్థకు రావడానికి బ్రాహ్మిణి కారణమయ్యారు. తాత ఎన్టీఆర్ పాలు అమ్మి జీవితాన్ని గడిపాడని ఆయనను ఆదర్శంగా తీసుకొని హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేయడంలో బ్రాహ్మిణి ఎంతో కృషి చేస్తోంది.
ఇక బ్రాహ్మిణి హెరిటేజ్ ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక తదతర రాష్ట్రాల్లో ప్రధానమైన బ్రాండ్ గా నిలిచేలా బ్రాహ్మిణి కృషి చేశారు. జీరో ఆదాయం ఉన్న హెరిటేజ్ సంస్థను రూ.2,500 కోట్ల ఆదాయం వచ్చేలా బ్రాహ్మిణి తీర్చిదిద్దారు. సాధారణంగా చాలా మంది వారసత్వంతోనే వ్యాపారంలో ఇతర రంగాల్లో ఎదుగుతారు. కానీ బ్రాహ్మిణి మాత్రం తన బ్రాగ్రౌండ్ విషయాలను పంచుకోకుండా తన స్వయం శక్తితో సంస్థను విజయపథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu naidu daughter in law brahmini 2500 rupees crore business success secret
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com