Car Safety
Car Safety : కొత్తగా కారు కొనుగోలు చేయాలని చూసే వాళ్లు అత్యధిక మైలేజీ, అధిక సేఫ్టీని ఇచ్చే వాహనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కారు కొనుగోలు చేసే వాళ్లు సేఫ్టీనే చూస్తారు. ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన సేఫ్టీ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. మీరు కూడా సమీప భవిష్యత్తులో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. రూ.10లక్షల్లోపు బడ్జెట్ మీదైతే ఈ వార్తను చివరి వరకు చదవండి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 5 స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ తన కస్టమర్లకు సేఫ్టీ కోసం స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది. భారత మార్కెట్‌లో హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.94 లక్షలు. హ్యుందాయ్ వెన్యూ ప్రజాదరణ పెరుగుతున్న దృష్ట్యా, కంపెనీ ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను 2025 జూన్ తర్వాత విడుదల చేయవచ్చు.
మహీంద్రా XUV 3XO
మీరు బడ్జెట్ సెగ్మెంట్‌లో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన SUV కొనాలనుకుంటే.. మహీంద్రా XUV 3XO ఒక బెస్ట్ ఆఫ్షన్ కావచ్చు. భారతీయ మార్కెట్‌లో మహీంద్రా XUV 3XO ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షలు.
టాటా నెక్సాన్
భారత వినియోగదారుల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. తన కస్టమర్లకు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లసేఫ్టీను అందిస్తుంది. భారత మార్కెట్‌లో టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షలు.
కియా సోనెట్:
కియా సోనెట్ కూడా స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన SUV కొనడానికి ఒక బెస్ట్ ఆఫ్షన్. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియా సోనెట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షలు.
హోండా అమేజ్
హోండా సంస్థ హోండా అమేజ్ ను 2024 చివరిలో అప్‌డేట్ చేసింది. అప్‌డేటెడ్ హోండా అమేజ్‌లో వినియోగదారులకు సేఫ్టీ కోసం స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తాయి. భారతీయ మార్కెట్‌లో హోండా అమేజ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.14 లక్షలు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Car safety suvs with 6 airbags under 10 lakhs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com