Lic Policy: ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రూ.29 పొదుపుతో రూ.లక్షల్లో పొందే అవకాశం?

Lic Policy:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా కొన్ని పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ అలా అమలు చేస్తున్న పాలసీలలో ఆధార్ శిలా పాలసీ కూడా ఒకటి. మహిళలు ఆధార్ శిలా పాలసీ తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్ ను పొందాలని భావించే వాళ్లకు ఆధార్ శిలా పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. 8 […]

Written By: Navya, Updated On : March 30, 2022 10:21 am
Follow us on

Lic Policy:  దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరే విధంగా కొన్ని పాలసీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ అలా అమలు చేస్తున్న పాలసీలలో ఆధార్ శిలా పాలసీ కూడా ఒకటి. మహిళలు ఆధార్ శిలా పాలసీ తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్ ను పొందాలని భావించే వాళ్లకు ఆధార్ శిలా పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది.

Lic Policy

8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు ఆధార్ శిలా పాలసీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ కలిగి ఉన్న మహిళలు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ పాలసీ కోసం ప్రీమియంను చెల్లించే విషయంలో నచ్చిన ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు లోన్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: CM Jagan Gets Negative Review: జగన్ కు మరో అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరా?

ఈ పాలసీని తీసుకోవడం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత లభించే అవకాశం అయితే ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 75 వేల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈ పాలసీని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 3 లక్షల రూపాయల బీమాకు పాలసీ తీసుకునే వాళ్లు సంవత్సరానికి రూ.10,800 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు డెత్ క్లెయిమ్ పై ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మహిళలకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్.ఐ.సీ ఏజెంట్ ను సంప్రదించడం లేదా సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read: RRR: బాహుబలికి ఉన్న ఊపు ‘ఆర్ఆర్ఆర్’కు ఎందుకు లేదు?