Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభం సంపాదించాలని అనుకునే వాళ్లకు టీ షర్ట్ ప్రింటింగ్ బిజినెస్ (Business) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దేశంలో రోజురోజుకు టీషర్టుల వినియోగం పెరుగుతోంది. టీషర్ట్‌లపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ బిజినెస్ ద్వారా చాలామంది ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఊరేగింపులు, పొలిటికల్ ర్యాలీలు, ఫంక్షన్లు, కార్పొరేట్ ప్రమోషన్ల కోసం ఎక్కువగా ఈ తరహా టీషర్టులను వినియోగించడం జరుగుతుంది.
టీషర్ట్స్ పై ప్రింట్ చేసే మిషన్ ధర 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వస్తాయని అనుకునే వాళ్లు లక్ష రూపాయల విలువ గల మిషన్ ను కొనుగోలు చేస్తే మంచిది. టీషర్ట్ లతో పాటు ప్లేట్లపై, మగ్స్, టోపీలపై కూడా ప్రింటింగ్ ఆర్డర్లను తెచ్చుకుని ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చు. సెల్‌ఫోన్ కవర్లపై, గిఫ్ట్ ఆర్టికల్స్‌పై ప్రింటింగ్స్ చేసి ఆదాయం పెంచుకోవచ్చు.
ఇంటి నుంచి సులభంగా డబ్బు సంపాదించుకోవాలని భావించే మహిళలకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా ఈ వ్యాపారం చేసేవాళ్లు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రింటింగ్ మెషీన్ ధర్ రూ. 13వేల నుంచి ప్రారంభం కాగా సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇంక్ ధర 2,000 రూపాయల వరకు ఉంటుంది. 50,000 రూపాయల లోపు పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.
ప్రింటింగ్ అయిన తర్వాత టీషర్ట్ విలువ 250 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా టీషర్ట్ లను విక్రయించవచ్చు. మార్కెట్లో పరిచయాలు ఎక్కువగా ఉండి ఎక్కువ ఆర్డర్లు తెచ్చుకోగలిగితే ఎక్కువ లాభాలు పొందవచ్చు.