Business Idea: వేసవికాలంలో ఎండవేడికి శరీరం కూడా వేడి చేస్తుంది. డిహైడ్రేషన్ ఎక్కువగా అవుతుంది. ఈ క్రమంలో చాలామంది ప్రతిరోజూ ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో శరీరానికి ఎంతో మంచిదైన కొబ్బరినీళ్ళతో హెల్తీ డ్రింక్స్ తయారు చేస్తున్న కోకో మామ షాప్ గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఎండాకాలంలో ఎండల తీవ్రత వలన శరీరం ఎక్కువగా డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగకపోతే కూడా శరీరం వేడి చేస్తుంది. ఈ క్రమంలో వేడి నుంచి శరీరాన్ని కోలుకునేలా చేసేది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిహైడ్రేషన్ కాకుండా చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్లలో సీజనల్గా దొరికే ఫలాలను కలిపి వివిధ రకాలైన డ్రింక్స్ తయారు చేస్తూ వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు ఒక వ్యక్తి. అతని పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ శ్రీకాకుళం జిల్లా వంజంగి గ్రామానికి చెందిన వ్యక్తి.
Also Read: ఓలా, ఏథర్‌కు ఇక కష్టాలు మొదలు.. బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!
ఇతను డిప్లమా పూర్తి చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం కూడా చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం నచ్చక తానే స్వయంగా వ్యాపారం చేయాలని ఒక వినూత్నమైన ఆలోచనతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు కిరణ్ కుమార్. హెల్దీగా ఉండే ఏదైనా ఒక డ్రింక్ తయారు చేయాలి అనుకున్నాడు. ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరినీళ్లు. ఈ కొబ్బరినీళ్ళతో కిరణ్ కుమార్ చాలా భిన్నంగా ఆలోచించి ఆ కొబ్బరి నీళ్లలో వివిధ పండ్ల జ్యూస్ లను కలిపి డ్రింక్స్ తయారు చేసి ప్రస్తుతం కష్టమర్ల మన్ననలను పొందుతున్నాడు. కిరణ్ కుమార్ నడిపే షాపు పేరు కోకో మామ జ్యూస్ షాప్.
ఈ షాప్ లో కోకోనట్ వాటర్, కోకోనట్ జ్యూస్, కోకోనట్ లస్సీ, కోకోనట్ కూలర్స్ లో కోకోనట్ వాటర్, మిలన్ కోకోనట్, పోమో గ్రానైట్ కోకోనట్, కోకోనట్ సపోటా వంటి వివిధ రకాల జ్యూస్ లో దొరుకుతాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కోకోనట్ ఐస్ ఆపిల్ జ్యూస్ బాగా ఫేమస్ అయ్యింది అని ఈ షాప్ యజమాని కిరణ్ కుమార్ లోకల్ ఛానల్ కు వివరించడం జరిగింది. ఇటీవల ఈ షాప్ యజమాని కిరణ్ కుమార్ లోకల్ 18 తో మాట్లాడుతూ లేత కోకోనట్ వేసి తయారుచేసిన కోకోనట్ ఆపిల్ జ్యూస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్ముడు అవుతుందని వివరించాడు. అలాగే ఈ షాప్ లో 40 రూపాయల నుంచి 99 రూపాయల వరకు రకరకాల అయిన కోకో కూలర్స్, కోకో మిల్క్ షేక్ వంటివి దొరుకుతాయి.