BSNL : టెలికాం రంగంలో ప్రైవేట్ కంపెనీల రీఛార్జీల ధరల పెంపుతో వినియోగదారులు విసిగిపోయారు. అలాంటి వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ ఊరటనిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ, ప్రయోజనాలను అందిస్తూ జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీనిస్తోంది. తాజాగా 336 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ విడుదల చేసిన కొత్త ప్లాన్ ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : ఆర్డర్ చేసిన 90నిమిషాల్లోనే మీ ఇంటికి బీఎస్ఎన్ఎల్ 5జి సిమ్.. ప్రాసెస్ ఇదే
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల సౌకర్యం కోసం బీఎస్ఎన్ఎల్ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను అందిస్తుంది. తాజాగా బీఎస్ఎన్ఎల్ 336 రోజుల వ్యాలిడిటీతో ఒక కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఎయిర్టెల్, జియోలకు గట్టి పోటీనిస్తోంది.
తక్కువ ఖర్చులో ఎక్కువ వ్యాలిడిటీ
బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్లాన్‌లో మీకు 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకునే బాధ తప్పుతుంది. తక్కువ కాలింగ్, డేటా ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరెన్నో ప్రయోజనాలు
ఈ ప్లాన్‌లో మీకు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్‌లో మొత్తం 24 జీబీ డేటా లభిస్తుంది. దీనిని మీరు 336 రోజుల వ్యాలిడిటీతో ఉపయోగించుకోవచ్చు.
జియో ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ
రిలయన్స్ జియో రూ. 3599 ఖర్చుతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2.5 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ సౌకర్యం కూడా ఉంది. దీని ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి మాట్లాడవచ్చు. ఇందులో ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి. జియో తన వినియోగదారులకు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది.
ఎయిర్టెల్ రూ. 4000 ప్లాన్:
ఎయిర్టెల్ రూ. 4000 ప్లాన్‌లో 5 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు మొత్తం 100 నిమిషాల వరకు ఇన్కమింగ్ , అవుట్గోయింగ్ కాలింగ్ లభిస్తుంది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా 250 ఎంబీ డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయోజనం కొన్ని ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. భారతదేశంలో ఈ ప్లాన్‌లో ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి.