BSNL 5G Sim : ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఒక కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ 5G సిమ్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఈ సిమ్ కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటికి చేరుతుంది. గతంలో ఎయిర్‌టెల్ బ్లింకిట్‌తో కలిసి 10 నిమిషాల్లో సిమ్ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కూడా తన కొత్త సర్వీస్‌ను ప్రారంభించడంతో మీ సిమ్ కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటి వద్ద ఉంటుంది.
Also Read: హీరో స్ప్లెండర్ జోరు.. ఏడాదిలో మార్కెట్లో దుమ్ములేపింది
బీఎస్ఎన్ఎల్ తన 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ లక్ష 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో 80 వేల టవర్లు అక్టోబర్ 2024 నాటికే యాక్టివ్ అయ్యాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4G మౌలిక సదుపాయాలను ఉపయోగించి 5G సేవలను ప్రారంభించే దిశగా పనిచేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందగలరు.
గత ఏడాది Jio, Airtel, Vi వంటి కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సమాచారం ప్రకారం.. కేవలం జూలై 2024లో మాత్రమే బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్‌లో 2.17 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఇది కంపెనీకి ఒక పెద్ద విజయం.
ఇకపై ఆన్‌లైన్‌లో సిమ్
సిమ్ తీసుకునే వారి సంఖ్య పెరగడంతో బీఎస్ఎన్ఎల్ స్టోర్లలో పెద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఆన్‌లైన్ సిమ్ బుకింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో KYC ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది. సిమ్ డెలివరీ వేగంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో కూర్చొని బీఎస్ఎన్ఎల్ 4G లేదా 5G సిమ్‌ను ఆర్డర్ చేయవచ్చు.
* ఇందుకోసం https://prune.co.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
* “Buy SIM Card” ఎంపికను ఎంచుకోండి. Indiaను సెలెక్ట్ చేయండి.
* ఆపరేటర్‌లో BSNLను ఎంచుకోండి. మీకు నచ్చిన FRC ప్లాన్‌ను ఎంచుకోండి.
* మీ వివరాలను నింపండి, OTPతో వెరిఫై చేయండి.
* మీ అడ్రస్ ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే వాటిని ఫాలో అవ్వండి.
* కార్డ్ కేవలం 90 నిమిషాల్లో మీ ఇంటికి చేరుతుంది.